Internet Speed: మీ ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచాలనుకుంటున్నారా.? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.!

|

May 24, 2021 | 12:47 PM

Annoyed By Slow Internet: కరోనా కారణంగా చాలామంది 'వర్క్ ఫ్రం హోం' వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో కూర్చుని పనిని పూర్తి చేయాలంటే..

Internet Speed: మీ ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచాలనుకుంటున్నారా.? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.!
Mobile Internet
Follow us on

Annoyed By Slow Internet: కరోనా కారణంగా చాలామంది ‘వర్క్ ఫ్రం హోం’ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో కూర్చుని పనిని పూర్తి చేయాలంటే సూపర్ స్పీడ్ ఇంటర్నెట్ చాలా అవసరం. దేశమంతా కూడా 4జీ ఇంటర్నెట్ సదుపాయం ఉండటం ఇది పెద్ద సాధ్యమేమి కాదు. అయితే కొంతమందికి 4జీ సిమ్ ఉన్నప్పటికీ, వేగవంతమైన ఇంటర్నెట్ లేదా డేటా వేగం నెమ్మదిగా ఉండవచ్చు. అలాంటివారు తమ మొబైల్ సెట్టింగులలో కొన్ని మార్పులు చేయడం ద్వారా సూపర్ స్పీడ్ ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

మొబైల్ సెట్టింగ్స్…

  • మీ మొబైల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఉందా.? చెక్ చేసుకోండి.
  • మీ మొబైల్ మీరు ఆశించే ఇంటర్నెట్ వేగాన్ని ఇస్తుందో లేదో చెక్ చేయండి. మొబైల్ ర్యామ్‌ను క్లీన్‌గా ఉంచుకోండి.
  • VPN సేవను తాత్కాలికంగా ఆపేయండి.
  • మొబైల్ నోటిఫికేషన్‌లను ఆపేయండి.

సిమ్ కార్డ్ సంబంధిత సెట్టింగ్‌లు..

  • మీ ప్రాంతంలో ఏ కంపెనీ సిమ్ కార్డు ఉత్తమ నెట్‌వర్క్, గరిష్ట ఇంటర్నెట్ వేగాన్ని ఇస్తుందో తెలుసుకోండి. ఆ టెలికాం ప్రొవైడర్‌కు చెందిన సిం కార్డు తీసుకోండి. లేదా మీ దగ్గర ఉన్న సిమ్‌ను పోర్టబిలిటీ పెట్టుకోండి.
  • మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సిమ్ కార్డ్ 4జీ అప్‌గ్రేడ్ అయిందా .? లేదా చూడండి.. ఒకవేళ కాకపోతే 4జీకి అప్ గ్రేడ్ చేయండి.

వైఫై రౌటర్ ఉపయోగిస్తుంటే సంబంధిత సెట్టింగులు..

  • Wi-Fi మోడ్ – AX <A <N <B <G.
  • మీ వైఫైతో ఒకటి నుంచి రెండు వరకు పరికరాలు కనెక్ట్ అయ్యేలా చూసుకోండి.
  • ఫ్రీక్వెన్సీ ఛానెల్‌ను ఏదో ఒకదానికి సెట్ చేయండి. సంక్షిప్తంగా, ఆటో మోడ్‌కు మారవద్దు.
  • వైఫైతో ఒకేసారి ఒకదానిని మాత్రమే ఉపయోగించండి.

బ్రౌజర్ సంబంధిత సెట్టింగ్‌లు..

  • బ్రౌజర్‌లో ప్రైవేట్ మోడ్‌ను ఉపయోగించవద్దు.
  • బ్రౌజర్‌లో అవసరం లేనప్పుడు ‘ఇమేజ్ డౌన్‌లోడ్’ ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
  • బ్రౌజర్‌లో వాయిస్ ఆదేశాలను ఇన్‌పుట్ చేయకుండా టైప్ చేయడానికి ప్రయత్నించండి.
  • యూట్యూబ్‌లో వీడియో చూసేటప్పుడు మీరు సౌండ్ మాత్రమే వినాలి అనుకుంటే, వీడియో రిజల్యూషన్‌ను కనిష్టంగా ఉంచండి.
  • ప్రతిరోజూ మీరు ఉపయోగించే వెబ్‌సైట్‌లను బుక్ మార్క్స్ చేసుకోండి.

VPN సేవ…

  • చెల్లింపు సేవను ఉపయోగించడం మంచిది.
  • వర్చువల్ సర్వర్‌ను ఎన్నుకునేటప్పుడు, అది సమీప దేశంలో ఉందని నిర్ధారించుకోండి.
  • తక్కువ ఇంటర్నెట్ లోడ్ ఉన్న సర్వర్‌ని ఎంచుకోండి. సర్వర్ లోడ్ 40% నుండి 55% మధ్య ఉందో లేదో నిర్ధారించుకోండి.
  • మీరు సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే, రాత్రి 11:30 నుండి ఉదయం 6 గంటల వరకు ఇంటర్నెట్‌ను ఉపయోగించండి. ఆ సమయంలో ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!