ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. టెక్ మార్కెట్లో రోజుకో ట్రెండీ గ్యాడ్జెట్ సందడి చేస్తోంది. మారుతోన్న టెక్నాలజీకి, యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లతో కూడిన గ్యాడ్జెట్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. టెక్ రంగంలో ఇలాంటి అద్భుత ఆవిష్కరణల్లో స్మార్ట్ ఫోన్ ఒకటి. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌తో చేయలేని పని అంటూ ఏదీ లేదు.
అయితే తాజాగా స్మార్ట్ ఫోన్‌ను కూడా తలదన్నే ఓ గ్యాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. ఏఐ పిన్ పేరుతో లాంచ్ అయిన ఈ బుల్లి గ్యాడ్జెట్ స్మార్ట్ ఫోన్‌కు పెట్టనుందని ఈ గ్యాడ్జెట్‌ను తయారు చేసిన సంస్థ చెబుతోంది. అమెరికాకు చెందిన హ్యుమేన్ అనే స్టార్టప్ కంపెనీ ఈ డివైజ్‌ను రూపొందించింది. హ్యుమేన్ స్టార్టప్ కంపెనీని యాపిల్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు స్థాపించారు. ఇంతకీ ఈ డివైజ్ ఎలా పని చేస్తుంది.? ఇందులో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఈ చిన్న డివైజ్‌లో ఎలాంటి స్క్రీన్ ఉండదు. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ డివైజ్‌ను దుస్తులకు ఎక్కడైనా అతికిచుకునేలా డిజైన్ చేశారు. అత్యంత తక్కువ బరువుతో రూపొందించిన ఈ డివైజ్‌లో కెమెరా, మైక్రోఫోన్, యాక్సెలరోమీటర్ వంటి సెన్సార్లను అందించారు. స్మార్ట్ ఫోన్ మాదిరిగానే డివైజ్‌తో కాల్స్ చేయొచ్చు. మెసేజ్‌లు పంపుకోవచ్చు, ఫొటోలు, వీడియోలు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఎలాంటి యాప్స్ అవసరం లేకుండానే ఈ పనులన్నీ చేసుకోవచ్చు.
ఈ చిన్న డివైజ్‌లో ఉన్న మరో అద్భుత ఫీచర్ ఇన్ బిల్ట్ ఇన్ ప్రొజెక్టర్ ఫీచర్. దీని సహాయంతో ఏదైనా వస్తువపై డిస్‌ప్లేగా వినియోగించుకోవచ్చు. దీంతో వీడియోలను, ఫొటోలను ప్రొజెక్షర్ సహాయంతో చూడొచ్చు. అలాగే ఈ గ్యాడ్జెట్ వివిధ రకాల సెన్సర్లు, ఏఐ టెక్నాలజీతో పని చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ సహాయంతో మీ అవసరాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు మీరు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే.. వారి పేరు చెప్తే కాల్ వెళుతుంది.
అంతేకాదండోయ్ టైప్ చేయాల్సిన అవసరం లేకుండానే మెసేజ్ కూడా వెళ్తుంది. ఈ చిన్న గ్యాడ్జెట్‌తతో ఇతర డివైజ్‌లను కంట్రోల్ కూడా చేయొచ్చు. అంతేకాదు వేరే భాషలో అవతలి వ్యక్తి మాట్లాడిన దాన్ని ట్రాన్స్‌లేట్ కూడా చేస్తుంది. వర్చువల్ అసిస్టెంట్‌గానూ పనిచేస్తుంది. ఇక ధర విషయానికొస్తే దీని ధరను 699 డాలర్లుగా నిర్ణయించింది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 58 వేలకు పైమాటే. 2024 నుంచి ఈ ప్రొడక్ట్ డెలివరీలు ప్రారంభంకానున్నాయని తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..