Amazon Prime: ఇకపై అమేజాన్‌ ప్రైమ్‌ వీడియోను ఇతరులకు షేర్‌ చేసుకోవచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్‌..

|

Nov 14, 2021 | 3:32 PM

Amazon Prime: ప్రస్తుతం వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంల హవా నడుస్తోంది. ఓటీటీకి వేదికలకు బాగా డిమాండ్‌ పెరుగుతుండడం, బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో ఈ స్ట్రీమింగ్‌ సేవలు ఊపందుకున్నాయి...

Amazon Prime: ఇకపై అమేజాన్‌ ప్రైమ్‌ వీడియోను ఇతరులకు షేర్‌ చేసుకోవచ్చు.. అందుబాటులోకి కొత్త ఫీచర్‌..
Amazon Prime Video
Follow us on

Amazon Prime: ప్రస్తుతం వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంల హవా నడుస్తోంది. ఓటీటీకి వేదికలకు బాగా డిమాండ్‌ పెరుగుతుండడం, బడా నిర్మాణ సంస్థలు ఈ రంగంలోకి అడుగుపెట్టడంతో ఈ స్ట్రీమింగ్‌ సేవలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలో అమెజాన్‌ ప్రైమ్‌ తన ముద్ర వేసుకుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో అమెజాన్‌ వీడియో స్ట్రీమింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఓటీటీ వేదికల మధ్య పోటీ పెరుగుతుండడంతో తాజాగా యూజర్లు ఆకట్టుకునే క్రమంలో అమెజాన్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ప్రైమ్‌లో కేవలం వీడియోలను చూసుకునే అవకాశం మాత్రమే ఉంది.. కానీ అందులోని కంటెంట్‌ను ఇతరులకు షేర్‌ చేసుకునే చాన్స్‌ లేదు.

అయితే తాజాగా అమెజాన్‌ తీసుకురానున్న కొత్త ఫీచర్‌తో తమ యాప్ నుంచి 30 సెకన్ల వీడియో క్లిప్‌ను సులభంగా షేర్ చేసే అవకాశాన్ని కలిపించనుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కేవలం ఐఫోన్‌ ఉపయోగిస్తున్న వారికి మాత్రమే అందుబాటులోకి తేనుంది. అంతేకాకుండా ప్రస్తుతానికి ఈ వీడియో షేరింగ్‌ ఫీచర్‌ను కేవలం కొన్ని పరిమిత సంఖ్యలో ఉన్న షోలకు మాత్రమే అందుబాటులోకి తేనున్నారు.

ఇందుకోసం ఏదైనా షో లేదా సినిమా చూస్తున్న సమయంలో డిస్‌ప్లేపై కనిపించే కంట్రోల్స్ ఆప్షన్లలో ‘షేర్ క్లిప్’ బటన్‌పై క్లిక్ చేస్తే 30 సెకన్ల వీడియో క్లిప్ క్రియేట్ అవుతుంది. ఫైన్ ట్యూనింగ్ తరువాత ఈ క్లిప్‌ను షేర్ చేయవచ్చు. ఇక ఈ వీడియోను యాపిల్‌ యూజర్లు ఐమెసేజ్‌ ద్వారా స్నేహితులకు పంపవచ్చు. లేదా సోషల్‌ మీడియాలో కూడా షేర్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ప్రస్తుతానికి ప్రైమ్‌ వీడియో యాప్‌ వెర్షన్‌ 8.41లో అందుబాటులో తీసుకొచ్చారు.

Also Read: 580 సంవత్సరాల తర్వాత కనిపించే సుదీర్ఘమైన చంద్రగ్రహణం.. ఎప్పుడు.. ఎక్కడ కనిపిస్తుందో తెలుసుకోండి..

Actor Sonu Sood: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో సోనూ సూద్ కీలక ప్రకటన.. ఇంతకీ ఏమన్నారంటే..?

TRS: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం కేసీఆర్ కసరత్తు.. ఫైనల్ లిస్ట్‌లో ఆ ఇద్దరి పేర్లు..