Amazon Sale: కేవలం రూ. 1500కే వివో స్మార్ట్ ఫోన్ పొందండిలా.. పూర్తి వివరాలు..

|

May 30, 2023 | 7:00 AM

స్మార్ట్ ఫోన్ కొనాలనుకొనే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ అన్ని బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. వాటిల్లో వివో వై33టీ ఫోన్ పై ఏకంగా 22శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఆపైన బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.

Amazon Sale: కేవలం రూ. 1500కే వివో స్మార్ట్ ఫోన్ పొందండిలా.. పూర్తి వివరాలు..
Vivo Y33t
Follow us on

స్మార్ట్ ఫోన్ కొనాలనుకొనే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ అన్ని బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. వాటిల్లో వివో వై33టీ ఫోన్ పై ఏకంగా 22శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఆపైన బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. పాత ఫోన్ ఎక్స్ చేంజ్ పై భారీ తగ్గింపు కూడా లభిస్తోంది. ఈ నేపథ్యంలో వివో వై33టీ ఫోన్ గురించి ఓసారి పూర్తిగా తెలుసుకుందాం.. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో పాటు అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఇంకా ధర, స్పెసిఫికేషన్లు, సామర్థ్యం గురించి తెలుసుకుందాం రండి..

స్పెసిఫికేషన్లు..

ఈ ఫోన్ లో 20:9 ఆస్పెక్ట్ రేషియోతో 1080*2480 పిక్సల్ రిజల్యూషన్ తో కూడిన ఐపీఎస్ ఎల్సీడీ టచ్ స్క్రీన్ ఉంటుంది. బెజెల్ ఫ్రీ స్కీన్ పై వాటర్ డ్రాప్ నాట్చ్ తో కూడిన సెల్ఫీ కెమెరా ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ మాక్రో కెమెరా, అడిషనల్ 2ఎంపీ డెప్త్ కెమెరా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఫ్లాష్ ఉంటుంది.

సామర్థ్యం..

ఈ ఫోన్లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్ ఉంటుంది. గ్రాఫిక్స్ కోసం వివో ఆండ్రెనో 610 ప్రాసెసర్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ధర ఎంతంటే..

ఈ వివో వై33టీ ఫోన్ సాధారణ ధర రూ. 22,990 కాగా అమెజాన్ లో ఇది 22శాతం డిస్కౌంట్ తో 17,990కే లభిస్తోంది. పైగా పలు బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఇవి కాక మీ పాత ఫోన్ ఎక్స్ చేంజ్ చేస్తే ఆ ఫోన్ పరిస్థితిని బట్టి దాదాపు రూ. 16,850 వరకూ వ్యాల్యూ దొరకుతుంది. ఇవన్నీ కలుపుకుంటే ఈ వివో ఫోన్ మీరు రూ. 1500లోపు ధరలోనే పొందవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..