ప్రస్తుతం భారీ స్క్రీన్ టీవీలకు ఆదరణ పెరుగుతోంది. ఓటీటీల ద్వారా కొత్త సినిమాలు విడుదలైన కొన్ని రోజులకు అందుబాటులోకి రావడంతో పెద్ద సైజ్ స్క్రీన్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే ఒకప్పుడు స్మార్ట్ టీవీలు అంటే లక్షల్లో పలికేవి కానీ ప్రస్తుతం కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో ధరలు అమాంతం తగ్గుముఖం పడుతున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం రెడ్‌మీ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రెడ్‌మీ 43 ఇంచెస్ టీవీపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రెడ్‌మీ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 42,999కాగా ఏకంగా 42 శాతం డిస్కౌంట్‌తో రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ టీవీని రూ. 23,499కే సొంతం చేసుకోవచ్చు.
ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 43 ఇంచెస్‌తో కూడిన 4కే అల్ట్రా హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో సినిమాతో పాటు సుమారు 1200కిపైగా యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ టీవీలో యాపిల్ స్టోర్, యాపిల్ టీవీ వంటివి కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ టీవీలో డ్యూయల్ బ్యాండ్ వైఫై, 2 యూఎస్‌బీ పోర్ట్స్, బ్లూటూత్ 5.0, ఇథర్‌నెట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.
ఇక ఈ టీవీలో 24 వాట్స్ అవుట్‌పుట్ డాల్బీ ఆడియో డీటీఎస్ వర్చువల్ ఎక్స్, డీటీఎస్ హెచ్‌డీ వంటి ఫీచర్లను అందించారు. ఈ టీవీపై కంపెనీ ఏడాది వారంటీ అందిస్తుంది. స్టోరేజ్ విషయానికొస్తే ఇందులో 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. క్వాడ్ కోర్ సీపీయూతో ఈ టీవీ పనిచేస్తుంది. ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ టీవీ పనిచేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..