Samsung Galaxy M05: రూ. 6వేలకే సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. స్టన్నింగ్ ఫీచర్స్‌..

|

Oct 06, 2024 | 6:37 PM

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్స్‌ అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే సామ్‌సంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌05 ఫోన్‌పై...

Samsung Galaxy M05: రూ. 6వేలకే సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. స్టన్నింగ్ ఫీచర్స్‌..
Samsung Galaxy M05
Follow us on

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్ ఇండియన్‌ సేల్‌లో భాగంగా భారీ డిస్కౌంట్స్‌ అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో అన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు. ఇందులో భాగంగానే సామ్‌సంగ్‌ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌05 ఫోన్‌పై అమెజాన్‌లో లభిస్తోన్న ఆఫర్‌ ఏంటి.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌05 స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 9,999గా ఉంది. అయితే ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 35 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ. 6499కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌ను అమెజాన్‌ పే బ్యాలెన్స్‌తో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 194 క్యాష్‌బ్యాక్‌ సొంతం చేసుకోవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ 6వేలకే సొంతం చేసుకోవచ్చు. కాగా మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా అదనంగా రూ. 6150 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత ఫోన్‌కు కనీసం రూ. 3 వేలు డిస్కౌంట్ లభించినా.. ఈ ఫోన్‌ను రూ. 3 వేలకే సొంతం చేసుకోవచ్చు.

సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్‌05 ఫీచర్ల విషయానికొస్తే. ఇందులో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 25 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ను ఇచ్చారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్‌ అప్‌గ్రేడ్‌, 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ఇవ్వనున్నారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో బ్లూటూత్‌, వైఫై, యూఎస్‌బీ వంటి ఫీచర్లు అందించారు. సెక్యూరిటీ కోసం ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..