ప్రస్తుత రోజుల్లో టెలికాం కంపెనీలు కేవలం ఫోన్ సంబంధిత సేవలకే పరిమితం కాకుండా ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవల వైపు కూడా వెళ్తున్నాయి. ఎప్పటినుంచే ఉన్న ఎయిర్‌టెల్ కంపెనీ ఇప్పటికే డిష్ టీవీ సేవలను అందిస్తుంది. అయితే తర్వాత వచ్చిన జియో ఎయిర్‌టెల్ కంటే ముందుగానే ఫైబర్ సేవలను ప్రారంభించింది. మంచి సేవలను అందించడంతో ప్రజాదరణ కూడా బాగా పొందింది. అయితే కొద్దిరోజుల్లోనే జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడా ఫైబర్ సేవలను ప్రారంభించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ పేరుతో ప్రజలకు మరింత చేరువైంది. అయితే ఉన్నత వర్గాల వారే ఎక్కువగా ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సేవలను పొందుతున్నారు. దీంతో అందరికీ అందుబాటులో ఉండేలా మరో కొత్త ప్లాన్ ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టింది. రూ.219కే ఎక్కువ రకాల సేవలను అందిస్తుంది. ఈ ప్లాన్‌ను బ్రాడ్‌బ్యాండ్ లైట్ ప్లాన్‌గా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్లాన్ గురించి ఇతర వివరాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బ్రాడ్‌బ్యాండ్ లైట్ ప్లాన్ నెలకు రూ.219 అంటే వార్షిక సభ్యత్వానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఈ ప్లాన్ కోసం సైన్ అప్ చేయడానికి మొత్తం రూ.3,101 చెల్లించాల్సి ఉంటుంది. ప్రయోజనాల విషయానికొస్తే కొత్త లైట్ ప్లాన్ వినియోగదారులకు 10 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ని అందిస్తుంది. అలాగే ఉచిత రూటర్ కూడా వస్తుంది. ఈ కొత్త ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ లైట్ ప్లాన్ బీహార్, ఈస్ట్ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓటీటీ లేదా లైవ్ టీవీ ప్రయోజనాలను మాత్రం ఈ ప్లాన్‌లో కవర్ అవ్వవు. అయితే తర్వాత దేశంలోని ఇతర నగరాల్లో ఇది అందుబాటులోకి వస్తుందా లేదా అనే దానిపై ఎలాంటి అప్‌డేట్ లేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..