AC Gas Leakage: ఏసీ నుంచి ఇలాంటి సంకేతాలు వస్తున్నాయా? గ్యాస్‌ లీకవుతున్నట్లే..తస్మాత్‌ జాగ్రత్త!

|

Jun 22, 2024 | 12:49 PM

ఏసీ గ్యాస్ లీక్ అయ్యే సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం. ముందస్తుగా గుర్తించకపోతే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. తద్వారా సకాలంలో మరమ్మతులు చేయడం, నష్టాన్ని నివారించవచ్చు. ఎయిర్ కండీషనర్ లీక్ అయ్యే ముందు కొన్ని సంకేతాల గురించి తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత మీ ఏసీలోని గ్యాస్ బయటకు వెళ్లిందని మీకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మీరు

AC Gas Leakage: ఏసీ నుంచి ఇలాంటి సంకేతాలు వస్తున్నాయా? గ్యాస్‌ లీకవుతున్నట్లే..తస్మాత్‌ జాగ్రత్త!
Air Conditioner
Follow us on

ఏసీ గ్యాస్ లీక్ అయ్యే సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం. ముందస్తుగా గుర్తించకపోతే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. తద్వారా సకాలంలో మరమ్మతులు చేయడం, నష్టాన్ని నివారించవచ్చు. ఎయిర్ కండీషనర్ లీక్ అయ్యే ముందు కొన్ని సంకేతాల గురించి తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత మీ ఏసీలోని గ్యాస్ బయటకు వెళ్లిందని మీకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే మీరు అప్రమత్తమై ఎయిర్ కండీషనర్ నుండి గ్యాస్ లీకేజీని అరికట్టవచ్చు. ఎయిర్ కండీషనర్ నుండి గ్యాస్ బయటకు వచ్చే ముందు ఇలా సంకేతాలు వస్తాయి.

ఇది కూడా చదవండి: Airtel 9 Plan: ఎయిర్‌టెల్‌ నుంచి అద్భుతమైన ప్లాన్‌.. కేవలం రూ.9తో అపరిమిత డేటా

  1. శీతలీకరణ లేకపోవడం: మీ AC మునుపటిలా చల్లదనాన్ని అందించకపోతే, అది గ్యాస్ లీక్ అవుతున్నట్లు సంకేతం కావచ్చు. గ్యాస్ పరిమాణం తగ్గినప్పుడు శీతలీకరణ సామర్థ్యం కూడా తగ్గుతుంది. కొన్ని రోజుల తర్వాత ఎయిర్ కండీషనర్ అస్సలు కూలింగ్‌ ఇవ్వదు.
  2. ఏసీ ఆన్ చేయగానే వింత శబ్దం: మీ ఎయిర్ కండీషనర్ కాయిల్ లీక్ అవుతుంటే మీ ఎయిర్ కండీషనర్ స్టార్ట్ అయినప్పుడు వింత శబ్దం వస్తుంటుంది. ఎయిర్ కండీషనర్ నుండి వచ్చే ఈ రకమైన శబ్దం మీ ఎయిర్ కండీషనర్ కంప్రెసర్ పాడైపోతుందని లేదా ఏసీ నుండి గ్యాస్ లీక్ అవుతుందని అర్థం చేసుకోవాలి.
  3. ఇవి కూడా చదవండి
  4. ఏసీ యూనిట్ దగ్గర దుర్వాసన: ఏసీ యూనిట్ దగ్గర ఏదైనా దుర్వాసన వస్తుంటే అది గ్యాస్ లీక్ అవుతున్నట్లు సంకేతం కావచ్చు. శీతలకరణి వాయువు వాసన చాలా ఘాటుగా ఉంటుంది. దీని ద్వారా సులభంగా గుర్తించవచ్చు. దీనితో పాటు కంప్రెసర్ స్టార్ట్ అయిన శబ్దం మీకు వినబడకపోయినా ఎయిర్ కండీషనర్ గ్యాస్ లీక్ అయిందని అర్థం చేసుకోవాలి.
  5. మీరు ఇలాంటి సంకేతాలలో ఏవైనా గుర్తించినట్లయితే అప్రమత్తం కావడం అవసరం. వెంటనే టెక్నిషియన్‌ను పిలిచింపి మరమ్మతులు చేయించడం చాలా ముఖ్యం. సమయానుకూలంగా సర్వీసింగ్‌ చేయించడం వల్ల ఏసీ కూలింగ్‌ రావడమే కాకుండా కరెంట్‌ కూడా అదా అవుతుంది. అలాగే ఏసీ ఎక్కువ కాలం పాటు సర్వీసు ఇచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఇంట్లో చపాతీలు ఎలా తయారు చేస్తారో తెలుసా..?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి