Air Conditioner: వేసవిలో ఏసీ వాడుతున్నారా..? ఇలా చేయండి.. లేకుంటే పాడైపోవచ్చు..!

Air Conditioner: చాలా మంది ఏసీలు వాడుతుంటారు. సమ్మర్‌ సీజన్‌ వచ్చేస్తోంది. ఎండవేడిమిని తట్టుకునేందుకు ఏసీల ముందు వాలిపోతుంటారు ఎంతో మంది. అయితే వర్షాకాలం, చలికాలంలో ఏసీలో పెద్దగా ఉపయోగం ఉండదు. ఇప్పుడు సమ్మర్‌ సీజణ్‌ వచ్చేస్తోంది కాబట్టి ఏసీలు వాడకం పెరిగిపోతుంటుంది. అందుకే ముందుగా వాటి సర్వీసింగ్‌ చేయించడం తప్పనిసరి. లేకుంటే పాడైపోయే అవకాశం ఉంటుంది..

Air Conditioner: వేసవిలో ఏసీ వాడుతున్నారా..? ఇలా చేయండి.. లేకుంటే పాడైపోవచ్చు..!

Updated on: Feb 16, 2025 | 2:50 PM

వేసవి కాలం వచ్చేస్తోంది. ఇప్పటి నుంచే ఎండలు మండిపోతున్నాయి. చాలా మంది ఇళ్లలో కూలర్లు, ఏసీలు వాడుతుంటారు. అయితే వర్షాకాలం, చలికాలంలో ఏసీలను పెద్దగా వాడరు. ఫిబ్రవరిలో వాతావరణం కాస్త వేడెక్కడం మొదలైంది. వేసవి త్వరగా వస్తుందనడానికి ఇది కూడా సంకేతం. ఈ కారణంగానే కొంతమంది కొత్త ఏసీలు కొనడం మొదలు పెడతారు. మరికొందరు పాత ఏసీలను సర్వీసింగ్ చేయడం, రిపేర్ చేయడం మొదలు పెడతారు.

శీతాకాలం రాగానే ఏసీ పనిచేయడం ఆగిపోతుంది. మీరు నెలల తరబడి పనిచేయని ఏసీని సర్వీసింగ్ చేయకుండా నడుపుతుంటే, మీ ఏసీ మండే వేడిలో పాడైపోవచ్చు. వేసవిలో ఏసీ ఉపయోగించే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. పెద్ద నష్టాన్ని నివారించాలంటే మీరు ఏం చేయలో చూద్దాం.

ఏసీ సర్వీస్ చేయించుకోకపోవడం వల్ల కలిగే నష్టాలు:

నెలల తరబడి మూసి ఉన్న ఏసీని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే నెలల తరబడి మూసి ఉన్న ఏసీలో దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. కొంత డబ్బు ఆదా చేయడానికి తమ ఏసీని సర్వీసింగ్ చేయించుకోని వారి ఏసీ మంచి కూలింగ్ ఇవ్వడం ఆగిపోవచ్చు. ఇది మాత్రమే కాదు. ఏసీలో సాంకేతిక లోపం కూడా ఉండవచ్చు. ఇది జరిగితే ఏసీ మరమ్మతుకు చాలా ఖర్చు అవుతుంది.

ఏసీ సర్వీసింగ్ వల్ల ప్రయోజనం ఏమిటి?

సర్వీసింగ్ చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, మీ ఏసీని సర్వీసింగ్ చేయడానికి వచ్చే వ్యక్తి AC ఫిల్టర్, కాయిల్, ఇతర భాగాలను పూర్తిగా శుభ్రం చేస్తారు. తద్వారా మీ ఏసీ పరిపూర్ణ స్థితిలో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, గ్యాస్ స్థాయిని కూడా తనిఖీ చేస్తారు. గ్యాస్ తక్కువగా ఉంటే, వేసవి రాకముందే, గ్యాస్ నింపడం వల్ల వేసవిలో AC కూడా మంచి గాలిని ఇస్తుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి