Aditya L1 Mission: సౌర వాతావరణంలో పెనుమార్పులు.. ఆదిత్య ఎల్‌1కి అతి పెద్ద ఛాలెంజ్..!

|

Sep 20, 2023 | 10:21 PM

2018లో నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్‌కి సంబంధించిన ఒక అనుభవం.. ఇప్పుడు ఆదిత్య ఎల్‌1ని వెంటాడుతోంది. ఇటీవలి కాలంలో సౌర తుపాన్ల తీవ్రత పెరిగిందని, సూర్యుడి నుంచి వెదజల్లబడే నిప్పు మేఘాల ధాటికి తమ పార్కర్ ప్రోబ్ తల్లడిల్లిందని, తర్వాత ఎలాగోలా తప్పించుకుందని చెబుతూ ఆ ఫుటేజ్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది నాసా. ఆదిత్య ఎల్‌1కి సైతం ఇటువంటి ప్రమాదం ఎదురైతే.. పరిస్థితి ఏంటి అనే ప్రశ్న స్పేస్ సైంటిస్టుల బుర్రలకు పనిపెడుతోంది. కానీ.. ఇస్రో మాత్రం డోన్ట్‌ వర్రీ అంటూ ధీమాతో ఉంది.

Aditya L1 Mission: సౌర వాతావరణంలో పెనుమార్పులు.. ఆదిత్య ఎల్‌1కి అతి పెద్ద ఛాలెంజ్..!
Aditya L1 Mission
Follow us on

ISRO Aditya L1 Mission: చంద్రయాన్‌3పై మరికొన్ని గంటల్లో సూర్యోదయం కాబోతోంది. చంద్రుడిపైకి ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మళ్లీ స్పృహలోకి వస్తాయా.. వస్తే ముందటిలాగే పనిచేస్తాయా అనేది ఒక టెన్షన్‌. ఇటు.. సూర్యుడి దగ్గరకు పంపిన ఆదిత్య ఎల్‌1పై కూడా కొత్తకొత్త సందేహాలు పుడుతున్నాయి. ఏమిటవి?

ఆదిత్య ఎల్‌1.. సూర్యుడిపై ఇస్రో చేసిన తొలి ప్రయోగం. సౌర వాతావరణాన్ని అధ్యయనం చెయ్యడానికి సెప్టెంబర్‌ 2న దీన్ని ప్రయోగించారు. ప్రస్తుతం ట్రాన్స్‌ లగ్రేంజియన్‌ పాయింట్‌1 దిశలో విజయవంతంగా తిష్ట వేసింది ఆదిత్య ఎల్‌1. మరో 110 రోజుల ప్రయాణం తర్వాత లగ్రేంజియన్‌ పాయింట్‌1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. కానీ.. ఇక్కడే పెద్ద ఛాలెంజ్‌ని ఎదుర్కోబోతోంది ఆదిత్య ఎల్‌1.

2018లో నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్‌కి సంబంధించిన ఒక అనుభవం.. ఇప్పుడు ఆదిత్య ఎల్‌1ని వెంటాడుతోంది. ఇటీవలి కాలంలో సౌర తుపాన్ల తీవ్రత పెరిగిందని, సూర్యుడి నుంచి వెదజల్లబడే నిప్పు మేఘాల ధాటికి తమ పార్కర్ ప్రోబ్ తల్లడిల్లిందని, తర్వాత ఎలాగోలా తప్పించుకుందని చెబుతూ ఆ ఫుటేజ్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది నాసా. ఆదిత్య ఎల్‌1కి సైతం ఇటువంటి ప్రమాదం ఎదురైతే.. పరిస్థితి ఏంటి అనే ప్రశ్న స్పేస్ సైంటిస్టుల బుర్రలకు పనిపెడుతోంది. కానీ.. ఇస్రో మాత్రం డోన్ట్‌ వర్రీ అంటూ ధీమాతో ఉంది.

ఎందుకంటే.. నాసావారి పార్కర్ సోలార్ ప్రోబ్‌కి, ఇస్రో వారి ఆదిత్య ఎల్‌1కి నిర్మాణ పరంగా చాలా తేడా ఉంది. పార్కర్ సోలార్ ప్రోబ్‌ని సూర్యుడికి 6.9 మిలియన్ కిలోమీటర్ల చేరువలోకి చేరేలా నిర్మించారు. ఆదిత్య ఎల్‌1 మాత్రం సూర్యుడికి అంత దగ్గరగా వెళ్లదు. భూమికి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైగా.. అంతరిక్షపరమైన ప్రమాదాల నుంచి తప్పించుకునేలా ఆదిత్య ఎల్‌1 పైపొరను ప్రత్యేకమైన లోహాలతో కట్టుదిట్టం చేసింది ఇస్రో. మితిమీరిన రేడియేషన్, ఎగసిపడే నిప్పు మేఘాల్లాంటివేవీ ఆదిత్య ఎల్‌1ని టచ్ చేసే పరిస్థితి ఉండదు. అందుకే.. ఆదిత్య ఎల్‌1 సురక్షితం అనేది ఇస్రో భరోసా.

మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..