మార్కెట్లో రకరకాల ల్యాప్‌టాప్స్ వస్తున్నాయి. అయితే Acemagic X1 ల్యాప్‌టాప్ మార్కెట్లో వచ్చింది. డ్యూయల్ స్క్రీన్‌తో వస్తున్న ప్రపంచంలోనే తొలి ల్యాప్‌టాప్ ఇదేనని కంపెనీ పేర్కొంది. ఈ స్క్రీన్ 360 డిగ్రీల హారిజాంటల్ ఫోల్డ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది పక్కపక్కనే డ్యూయల్ స్క్రీన్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఒక విధంగా దీనిని ఫ్లిప్ స్క్రీన్ అని కూడా అనవచ్చు. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి దీన్ని సెట్ చేసుకోవచ్చు. వినియోగదారులు దీన్ని సైడ్ బై సైడ్ డిస్‌ప్లేగా ఉపయోగించాలనుకుంటే, దాన్ని ఉపయోగించడం కూడా సులభం.
దీనికి ప్రత్యేక మోడ్:
ఇది బ్యాక్ టు బ్యాక్ మోడ్‌ను కూడా కలిగి ఉంది. దీని సహాయంతో మీరు మీ ముందు కూర్చున్న వ్యక్తికి ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను చూపవచ్చు. అటువంటి పరిస్థితిలో స్క్రీన్ ప్రెజెంటేషన్, ఆటలు ఆడటం, సినిమాలు చూడటం మొదలైన వాటిలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ధర గురించి వివరాలు లేవు. మార్కెట్‌లో చాలా డ్యూయల్ స్క్రీన్ ల్యాప్‌టాప్‌లు ఫీచర్లతో వచ్చినప్పటికీ, ఆ ల్యాప్‌టాప్‌లలో అదే సైజు స్క్రీన్ కనిపించదు. లేదా అవి నిలువుగా ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండవు.
ఫీచర్స్:
ఈ ల్యాప్‌టాప్‌లో 12 జనరేషన్ ఇంటెల్ కోర్ i7-1255U ప్రాసెసర్ వస్తుంది. Acemagic X1లో రెండు 14-అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్‌లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్ 16జీబీ డ్యూయల్ ఛానల్ DDR4 ర్యామ్, 1టీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌తో వస్తుంది. కనెక్టివిటీ గురించి మాట్లాడితే.. ఈ ల్యాప్‌టాప్‌లో రెండు యూఎస్‌బీ టైప్-సి, ఒక యూఎస్‌బీ 3.0 టైప్-A, ఒక HDMI 2.0 పోర్ట్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌ను రెండు యూఎస్‌బీ-C పోర్ట్‌లలో ఒకదాని సహాయంతో ఛార్జ్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ Wi-Fi 6, బ్లూటూత్ 5.2 సపోర్ట్‌తో వస్తుంది. అయితే, ఈ ల్యాప్‌టాప్ అమ్మకానికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై ఇంకా స్పష్టమైన వివరాలు లేవు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి