WhatsApp: మీరు వాట్సాప్ వాడుతున్నారా? మీకో షాకింగ్ రిపోర్ట్.. మీ నంబర్ ప్రమాదంలో ఉండోచ్చు.. జాగ్రత్త!
WhatsApp: డేటా ప్రమాదం ఉన్నందున వాట్సాప్ సంస్థ తక్షణమే చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని ‘రేట్ లిమిటింగ్’ వంటి కఠినమైన నిబంధనలను అమలు చేయాలని వియన్నా పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి వినియోగదారులు తమ ప్రైవసీ సెట్టింగ్స్ (Privacy Settings) పట్ల అప్రమత్తంగా ఉండాలని..

WhatsApp: వాట్సాప్.. దీని గురించి తెలియనివారంటూ ఉండరు. ప్రతి ఒక్కరు వాట్సాప్‌ను ఉపయోగిస్తుంటారు. చిన్నా నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడేస్తున్నారు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఎంతో మంది వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో తాజాగా ఒక తీవ్రమైన భద్రతా లోపం బట్టబయలైంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 350 కోట్ల మంది (3.5 బిలియన్) వినియోగదారుల ఫోన్ నంబర్లు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని ఆస్ట్రియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ వియన్నా’ పరిశోధకులు హెచ్చరించారు. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు భారీ ఎత్తున ఫోన్ నంబర్లను తస్కరించే అవకాశం ఉందని వారి అధ్యయనంలో వెల్లడైంది.
సాంకేతిక లోపాలను ఆధారం చేసుకుని..
పరిశోధకుల వివరాల ప్రకారం.. వాట్సాప్ సిస్టమ్‌లోని కొన్ని సాంకేతిక లోపాలను ఆధారంగా చేసుకుని, హ్యాకర్లు ఆటోమేటెడ్ స్క్రిప్ట్‌ల ద్వారా కోట్లాది మంది మొబైల్ నంబర్లను పరీక్షించి, అవి వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉన్నాయో లేదో తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ పరంగా కేవలం ఫోన్ నంబర్లు మాత్రమే కాకుండా ఆ నంబర్లకు అనుసంధానించిన ప్రొఫైల్ ఫోటోలు, స్టేటస్ వంటి వ్యక్తిగత వివరాలను కూడా సేకరించే ప్రమాదం ఉంది. ఇలా సేకరించిన డేటాబేస్‌ను హ్యాకర్లు డార్క్ వెబ్‌లో విక్రయించడం, లేదా ఫిషింగ్ దాడులు, స్పామ్ మెసేజ్‌లు, ఆర్థిక మోసాలకు వినియోగించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Expensive Toilet: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాయిలెట్.. ధర రూ.88 కోట్లు.. ప్రత్యేకత ఏంటి?
మెటా సంస్థ వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉందని, యూజర్ల డేటా భద్రంగా ఉందని చెబుతున్నప్పటికీ ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని తాజా పరిశోధన చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున డేటా లీకయ్యే అవకాశం ఉండటంతో మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: Lifestyle: శీతాకాలంలో మడమలకు పగుళ్లు వస్తున్నాయా? ఇలా చేస్తే మృదువుగా మారుతాయి!
ప్రైవసీ సెట్టింగ్‌పై అప్రమత్తంగా ఉండండి:
డేటా ప్రమాదం ఉన్నందున వాట్సాప్ సంస్థ తక్షణమే చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని ‘రేట్ లిమిటింగ్’ వంటి కఠినమైన నిబంధనలను అమలు చేయాలని వియన్నా పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి వినియోగదారులు తమ ప్రైవసీ సెట్టింగ్స్ (Privacy Settings) పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. అలాగే ‘లాస్ట్ సీన్’, ‘ప్రొఫైల్ ఫోటో’ వంటి ఆప్షన్లను కేవలం కాంటాక్ట్స్ వరకు మాత్రమే పరిమితం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కూడా చదవండి: PM Kisan: 21వ విడతకు ముందు 70 లక్షల మంది రైతుల పేర్లను తొలగించిన కేంద్రం.. ఎందుకో తెలుసా?
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








