
అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికతో టెలివిజన్(టీవీ)ల పరిణామ క్రమంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పిక్చర్‌ట్యూబ్ టీవీల నుంచి స్మార్ట్‌టీవీల వరకు టీవీల ప్రస్థానం కొనసాగింది. ప్రస్తుతం స్మార్ట్‌టీవీలు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫారంలో వచ్చే వీడియోలను నేరుగా టీవీల్లో పెద్ద స్క్రీన్‌పై చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఓటీటీ ప్లాట్‌ఫాం వీడియోలను కేవలం స్మార్ట్ టీవీల్లో మాత్రమే చూడగల్గుతాం అనుకుంటే మీరు పొరపడినట్లే..! మీ ఇంట్లో పాత ఎల్‌ఈడీ లేదా ఎల్‌సీడీ టీవీలను స్మార్ట్‌టీవీగా తయారుచేయవచ్చు. అది కూడా రూపాయి ఖర్చు లేకుండా! అదెలాగో ఇప్పుడు చూద్దాం..
మీ పాత టీవీని స్మార్ట్ టీవీగా మార్చేందుకు మీకు కొన్ని గ్యాడ్జెట్లు కావాల్సి ఉంటుంది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, జియో ఫైబర్ స్మార్ట్ సెట్ టాప్ బాక్స్, టాటా ప్లే బింగ్ ప్లస్ సెట్ టాప్ బాక్స్ వంటివి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇవి తక్కువ ధరకే వస్తాయి. అయితే అది కూడా వద్దు.. అస్సలు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకూడదు అనుకుంటే మేము చెబుతున్న ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీని కోసం మీరు హెచ్డీఎంఐ కేబుల్, హెచ్ డీ ఎంఐ పోర్టు ఉన్న ల్యాప్ టాప్ ఉంటే సరిపోతుంది. ఒక వేళ హెచ్ డీ ఎంఐ కేబుల్ లేకపోతే మీరు దానిని కొనుగోలు చేయొచ్చు. అది కేవలం రూ. 179 నుంచి ప్రారంభమవుతుంది. హచ్ డీఎంఐ కేబుల్ ద్వారా ల్యాప్ టాప్ నుంచి టీవీకి కనెక్షన్ ఇచ్చి మీ టీవీని స్మార్ట్ మార్చేయవచ్చు.
మీ వీడియో క్వాలిటీ బాగానే ఉంటుంది. మీరు ల్యాప్ టాప్ లోని యాప్ లో ఎంచుకున్న రిజల్యూషన్ ఆధారంగా ఈ పిక్చర్ క్వాలిటీ ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని సందర్బాల్లో పిక్చర్ క్వాలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. టీవీ సైజ్ ని బట్టి అది ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.