భారతదేశంలో ఇటీవల కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు ప్రజాదరణను పొందాయి. ఆయా సంస్థలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్స్‌ను పెడుతూ వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌తో వినియోగదారులను పలుకరించనుంది. గత కొన్ని రోజులుగా ఈ సేల్‌కు సంబంధించి కొన్ని ఉత్పత్తుల ధరలను రివీల్ చేస్తూ అంచనాలు పెంచేసింది. అయితే ప్రస్తుతం ఈ సేల్‌కు సంబంధించి తేదీలను కూడా ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఆగస్ట్ 5న ప్రారంభమై ఆగస్ట్ 9 వరకూ కొనసాగుతుంది. అలాగే మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే మీరు ఒక రోజు ముందుగానే సేల్‌ను యాక్సెస్ చేయగలుగుతారు. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై తగ్గింపు ధరలను అందిస్తుంది. ఈ సేల్లో ఏయే ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించారో? ఓ లుక్కేద్దాం.
ఈ సేల్‌లోని ఉత్పత్తులను ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే కస్టమర్లకు 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది. సామ్‌సంగ్, వన్‌ప్లస్, రియల్‌మీ వంటి ఫోన్లపై ఏకంగా 40 శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే ల్యాప్‌టాప్ లేదా కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ల ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. యాపిల్‌తో పాటు ఇతర కంపెనీల టాబ్లెట్‌లపై 50 శాతం వరకు తగ్గింపును చూడవచ్చు. అలాగే ల్యాప్‌టాప్‌లపై 40,000 వరకు తగ్గింపు ఆఫర్ లభిస్తుంది. హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై 75 శాతం వరకు తగ్గింపును పొందుతాయి.
ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఈవెంట్‌లో స్మార్ట్ టీవీలు, 4కే టీవీలపై 60 శాతం వరకు తగ్గింపు వస్తుంది. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇతర ఉపకరణాలు కూడా తగ్గింపు ధరలకు విక్రయిస్తారు. గేమింగ్పరంగా సోనీ ప్లేస్టేషన్-5 ఇతర ఉత్పత్తులపై కూడా తగ్గింపు ఉంటుంది. అయితే తక్కువ ధరకు విక్రయించే ఉత్పత్తుల కచ్చితమైన ధరను అమెజాన్ ఇప్పటివరకు వెల్లడించలేదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..