
కొత్త ఫీచర్ ద్వారా ఐఫోన్ యూజర్లు వేర్వేరు యాప్ లకు మారాల్సిన అవసరం ఉండదు. వాట్సాప్ నుంచి నేరుగా కాల్స్ చేసుకునే వీలుంటుంది. అలాగే మెసేజ్ లు కూడా పంపుకోవచ్చు. లేటెస్ట్ ఐఓఎస్ 18.2 అప్ డేట్ తో కాల్స్ చేసేటప్పుడు, మెసేజ్ లు పంపేటప్పుడు డిఫాల్ట్ ఫోన్ లేదా మెసేసింగ్ యాప్ కు బదులు వాట్సాప్ ను ఓపెన్ చేయవచ్చు. బ్రౌజింగ్ తో పాటు ఇ-మెయిల్ పంపేందుకు ఉపయోగించుకోవచ్చు.
ఈ కొత్త ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవడం చాలా సులభం. ముందుగా యాప్ స్టోర్ నుంచి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ను అప్ డేట్ చేయాలి. ఐఫోన్ లో సెట్టింగ్, యాప్స్, డిఫాల్ట్ యాప్ లకు వెళ్లాలి. కాల్స్, మెసేజ్ ల డిఫాల్ట్ గా వాట్సాప్ ను ఎంపిక చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత కాంటాక్ట్ నంబర్, మెసేజ్ బటన్ ను ట్యాప్ చేయాలి. తద్వారా బిల్ట్ ఇన్ యాప్ లకు బదులుగా ఆటోమేటిక్ గా వాట్సాప్ ను ఓపెన్ చేయవచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది వాట్సాప్ ను వినియోగించడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీన్ని వ్యక్తిగత చాట్ లు, గ్రూప్ సంభాషణలు, వ్యాపార అవసరాల కోసం కూాడా వాడుకోవచ్చు. అలాగే సమయం చాలా ఆదా అవుతుంది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ కారణంగా కాల్స్, మెసేజ్ లు ప్రైవేటుగా ఉంటాయి. అంతర్జాతీయ కాల్స్ ను ఉచితంగా చేసుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను చాలా సురక్షితంగా పంపుకోవచ్చు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి