త్వరలో 6G టెక్నాలజీలోకి భారత్..! ఇంటర్నెట్ స్పీడ్, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా?

|

Oct 14, 2021 | 2:40 PM

6G Technology: ప్రస్తుతం 6G నెట్‌వర్క్‌ కోసం దిగ్గజ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే శామ్‌సంగ్, ఎల్‌జీ, హువావే వంటి ప్రముఖ కంపెనీలు ఈ పనిలో నిమగ్నమయ్యాయి.

త్వరలో 6G టెక్నాలజీలోకి భారత్..! ఇంటర్నెట్ స్పీడ్, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా?
6g Technology
Follow us on

6G Technology: భారతదేశంలో టెలికాం కంపెనీలు ప్రస్తుతం 5G ట్రయల్స్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో 5G సర్వీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.‎ ఇంతలో 5G సేవ వాణిజ్యపరమైన ప్రారంభానికి ముందే 6G వస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 6G కోసం సన్నాహాలు మనదేశంలో కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. నివేదికల ప్రకారం 6G ఇంటర్నెట్ వేగం 5G కంటే 50 రెట్లు వేగంగా ఉంటుందంట.

వాస్తవానికి, ప్రభుత్వం 6G నెట్‌వర్క్ కోసం సిద్ధమవుతున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. టెలికాం శాఖ (DoT) స్టేట్ ఆపరేటెడ్ టెలికమ్యూనికేషన్ రీసెర్చ్ కంపెనీ C-DoT కి బాధ్యతను అప్పగించిందంట. 6G నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని సాంకేతిక అవకాశాలను అన్వేషించాలని ప్రభుత్వం C-DOT ని ఆదేశించినట్లు చెబుతున్నారు.

టెలికాం కార్యదర్శి 6G కి సంబంధించిన సాంకేతిక అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని, తద్వారా ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌తో పాటు భారతదేశంలో కూడా 6G లాంచ్ చేయవచ్చని కె. రాజారామన్ తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం 5G పరీక్షలు జరుగుతున్నాయి. 5G నెట్‌వర్క్ వాణిజ్యపరంగా 2019 లో దక్షిణ కొరియా, చైనా, యూఎస్ మార్కెట్‌లో ప్రారంభించబడింది.

ప్రస్తుతం 6G నెట్‌వర్క్‌లో దిగ్గజ కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటిలో శామ్‌సంగ్, ఎల్‌జీ, హువావే వంటి దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నాయి. 2028-2030 నాటికి 6G నెట్‌వర్క్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించవచ్చని అంచనా ఉంది. అందుకే ఇండియా కూడా 6G నెట్‌వర్క్ కోసం సిద్ధం చేయడం పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

5G నెట్‌వర్క్ వేగం
5G నెట్‌వర్క్ గురించి ఓసారి మాట్లాడితే, ఇది 20Gbps వరకు గరిష్ట డేటా డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తుంది. అదే సమయంలో, భారతదేశంలో 5G నెట్‌వర్క్ పరీక్షించే సమయంలో, డేటా డౌన్‌లోడ్ గరిష్ట వేగం 3.7 Gbps కి చేరుకుంది. ఈ మేరకు 5G నెట్‌వర్క్ ట్రయల్‌లో 3Gbps వరకు డేటా డౌన్‌లోడ్ చేయడానికి ఎయిర్‌టెల్, వీఐ, జియో స్పీడ్ టెస్ట్ నిర్వహించాయి.

6G నెట్‌వర్క్‌ వేగం..
అదే సమయంలో 6G నెట్‌వర్క్‌ వేగం 1000 Gbps కి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎల్‌జీ కూడా 6G ట్రయల్స్ ప్రారంభించినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి. నివేదికల ప్రకారం, కంపెనీ ఇటీవల జర్మనీలోని బెర్లిన్‌లో 6G నెట్‌వర్క్ ట్రయల్ ప్రారంభించింది. సమాచారం ప్రకారం ఈ పరీక్ష సమయంలో 100 మీటర్ల దూరంలో డేటాను పంపించడంతో పాటు స్వీకరించారు. ఈ పరీక్ష కూడా విజయవంతమైనట్లు తెలుస్తోంది. 6G నెట్‌వర్క్‌లో మీరు 6 GB మూవీని కేవలం 51 సెకన్లలో 1000 మెగాబైట్ల వేగంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

6G నెట్‌వర్క్ 5G కంటే 50 రెట్లు వేగంగా ఉంటుంది. జపాన్‌లో 6G నెట్‌వర్క్ 2030 నాటికి ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. జపాన్‌తో పాటు, దక్షిణ కొరియా, చైనా, ఫిన్లాండ్ కూడా 6G నెట్‌వర్క్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు భారతదేశంలో కూడా 6G నెట్‌వర్క్ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. డబ్ల్యూ నివేదిక ప్రకారం, యూరోపియన్ యూనియన్‌లో 6G నెట్‌వర్క్‌ల కోసం మిలియన్ల యూరోలు ఖర్చు చేస్తున్నాయి.

Also Read: Apple Watch Series 8: యాపిల్ వాచ్ 8 సిరీస్ ప్రత్యేకతలు ఏంటి? లాంఛ్ ఎప్పుడు? ఆసక్తికర విషయాలు వెల్లడి

Budget Smart Phones: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. రూ. 10 వేల లోపు లభించే అత్యుత్తమ ఫోన్లు ఇవే..