Airbag Scooter: కార్లకే కాదండోయ్‌.. ఇక స్కూటర్లకు కూడా ఎయిర్‌బ్యాగ్‌లు.. ప్రపంచంలోనే మొట్టమొదటి స్కూటర్!

Airbag Scooter: ఈ ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థ ఎదురుగా ఏదైనా వాహనం ఢికొన్నప్పడు రైడర్‌ను రక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఇది స్కూటర్ ముందు భాగంలోని ఆప్రాన్ లోపల అమర్చబడి ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు రక్షణ కల్పించడానికి రైడర్ ముందు వైపుకు తెరుచుకుంటుంది. అలాగే..

Airbag Scooter: కార్లకే కాదండోయ్‌.. ఇక స్కూటర్లకు కూడా ఎయిర్‌బ్యాగ్‌లు.. ప్రపంచంలోనే మొట్టమొదటి స్కూటర్!
Scooter With Airbag

Updated on: Mar 18, 2026 | 6:06 PM

Airbag Scooter: ఎయిర్‌బ్యాగ్‌లు అనేవి కార్లలో మాత్రమే ఉంటాయని మీకు తెలిసిందే. అవి కేవలం కార్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ ఇప్పుడు అవి స్కూటర్లలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఆటోమోటివ్ భద్రతా సంస్థ అయిన ఆటోలివ్ మోటార్స్, స్కూటర్ల కోసం ఒక ప్రత్యేకమైన ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి యమహా మోటార్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ వ్యవస్థను ఆ కంపెనీ ప్రీమియం స్కూటర్ అయిన యమహా ట్రైసిటీ 300లో చేర్చనున్నారు.

యమహా ట్రైసిటీ 300 స్కూటర్‌లో అందించిన ఈ ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీ ద్విచక్ర వాహన భద్రతా రంగంలో ఒక ప్రధాన మార్పుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థ సాధారణంగా కార్లకు మాత్రమే పరిమితమై ఉండేది.

ఈ ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థ ఎదురుగా ఏదైనా వాహనం ఢికొన్నప్పడు రైడర్‌ను రక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఇది స్కూటర్ ముందు భాగంలోని ఆప్రాన్ లోపల అమర్చబడి ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు రక్షణ కల్పించడానికి రైడర్ ముందు వైపుకు తెరుచుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి రెగ్యులర్‌ పెట్రోల్‌ లభించదు.. ప్రభుత్వం కొత్త నిబంధన

డిజైన్ విషయంలో రాజీ ఉండదు:

కంపెనీ ప్రకారం.. స్కూటర్ బ్యాలెన్స్‌కు భంగం కలగకుండా స్టోరేజ్ స్పేస్‌కు ఇబ్బంది లేకుండా, రైడింగ్ అనుభవానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా ఈ సిస్టమ్‌ను రూపొందించారు. దీనివల్ల భద్రత పెరిగినప్పటికీ వినియోగం మాత్రం యథాతథంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Business Idea: కేవలం రూ.50 వేల పెట్టుబడి.. నెలకు రూ.7.50 లక్షల లాభం.. వినూత్న వ్యాపారంతో ఏపీ కుర్రాడు!

ఈ వ్యవస్థ క్రాష్ పరీక్షలు:

వాస్తవ ప్రపంచ పరిస్థితులలో ఇది సురక్షితంగా, నమ్మదగినదిగా ఉందని నిర్ధారించుకోవడానికి ఎయిర్‌బ్యాగ్ వ్యవస్థను అధునాతన కంప్యూటర్ సిమ్యులేషన్‌లు, పూర్తి స్థాయి క్రాష్ పరీక్షలతో సహా కఠినమైన పరీక్షలకు గురిచేసినట్లు ఆటోలివ్ తెలిపింది.

2026లో ప్రారంభించవచ్చు:

నివేదికల ప్రకారం.. యమహా ట్రైసిటీ 300 ఎయిర్‌బ్యాగ్ వెర్షన్ 2026 మొదటి అర్ధభాగంలో మార్కెట్లో విడుదల కావచ్చు. అయితే దీని ధరను ఇంకా వెల్లడించలేదు.

ఇలాంటి ప్రయోగం ఇప్పటికే జరిగింది:

ఆటోలివ్ గతంలో పియాజియో గ్రూప్‌తో కలిసి పియాజియో MP3 స్కూటర్ కోసం ఒక ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌పై పనిచేసింది. కానీ అది ఇంకా మార్కెట్‌లోకి రాలేదు.

ఇది కూడా చదవండి: Income Tax: ఐటీఆర్‌లో చేసే ఈ చిన్న పొరపాటుకు భారీ షాక్.. 200 శాతం జరిమానా!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us