Anti Theft Apps: మీ ఫోన్‌ పోయినా వీటి ద్వారా కనిపెట్టొచ్చు.. ప్లే స్టోర్‌లో అత్యుత్తమ 10 యాప్స్ ఇవే..

Anti Theft Apps: ప్రస్తుత టెక్ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనిషి జీవితమే ఫోన్ మయం అయిపోయింది.

Anti Theft Apps: మీ ఫోన్‌ పోయినా వీటి ద్వారా కనిపెట్టొచ్చు.. ప్లే స్టోర్‌లో అత్యుత్తమ 10 యాప్స్ ఇవే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 03, 2021 | 7:17 PM

Anti Theft Apps: ప్రస్తుత టెక్ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనిషి జీవితమే ఫోన్ మయం అయిపోయింది. లేచింది మొదలు.. నిద్రపోయే వరకు ఫోన్‌ను వినియోగిస్తూనే ఉంటారు. కొద్ది క్షణం ఫోన్ లేకుంటే ప్రాణాలే పోయినంత ఫీల్ అయ్యే జనాలు ప్రస్తుత సమాజంలో కోకొల్లలు. ఇక ఫోన్‌ వినియోగంలోనే కాదు.. ఫోన్ ఉపయోగాలు కూడా అంతే రేంజ్‌లో ఉంటాయి. ఒక మనిషి సమస్త సమాచారం అందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. కాదు.. కాదు.. చేసుకుంటారు కూడా. వ్యక్తిగత సమాచారం మొదలు.. ఎంతో విలువైన సమాచారాన్ని వారి వారి ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటారు. ఇంతటి విలువైన సమాచారం ఉన్న ఫోన్లు ఒక్కసారిగా మిస్ అయితే, వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లకు మనం ఎన్ని పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నా.. కేటుగాళ్లు సింపుల్ టిప్స్‌తో అన్‌లాక్ చేసేస్తారు. ఈ నేపథ్యంలో.. అపహరణకు గురైన ఫోన్లను కనిపెట్టడం కోసం, అందులోని సమాచారం దుర్వినియోగం కాకుండా ఉండటం కోసం మార్కెట్‌లో ఎన్నో యాప్‌లు ఉన్నాయి. అంతేకాదు.. ఒకవేళ ఎవరైనా తమ ఫోన్‌ను దొంగిలించినట్లయితే.. అలారం మోగే మరెన్నో ఫీచర్లు ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఫోన్‌ అపహరణకు గురైనా.. మన సమాచారం భద్రంగా ఉంచేందుకు అవసరమైన ప్రధాన 10 యాప్‌ల గురించి తెలుసుకుందాం. ఆ 10 యాప్‌లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ ఫోన్‌‌ను అపహరణ నుంచి కాపాడే ప్రధాన 10 యాప్‌లు ఇవే.. 1. గూగుల్ ఫైండ్ మై డివైస్ (Google Find My Device) 2. సెర్బెరస్ ఫోన్ సెక్యూరిటీ (Cerberus Phone Security) 3. యాంటీ థెఫ్ట్ అలారం (Anti-Theft Alarm) 4. అవాస్ట్ యాంటీవైరస్-మొబైల్ సెక్యూరిటీ&వైరస్ క్లీనర్ (Avast Antivirus – Mobile Security & Virus Cleaner) 5. వేర్స్‌ మై డ్రాయిడ్ (Where’s My Droid) 6. మొబైల్ సెక్యూరిటీ (Mobile Security) 7. క్రూక్ క్యాచర్ (Crook Catcher) 8. ప్రే యాంటీ థెఫ్ట్ (Prey Anti Theft) 9. యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ (Anti Theft Security) 10. పాకెట్ సెన్స్ (Pocket Sense)

Also read:

Shaadi Mubarak Movie Pre Release Event: మొగిలిరేకులు ఫేం సాగర్ హీరోగా ‘షాదీ ముబారక్’. ప్రీరిలీజ్ ఈవెంట్ మీ టీవీ9 లైవ్‏లో…

కోవిడ్ 19 పాజిటివ్ కి గురై ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్ధి మృతి, మరో 9 మంది విద్యార్థులకు పాజిటివ్