Asteroid: భూమివైపు దూసుకొస్తోన్న పెను ప్రమాదం.. నాసా తీవ్ర హెచ్చరిక.. ఎప్పుడంటే?

|

Feb 07, 2022 | 4:32 PM

Asteroid: విశ్వంలోని వస్తువులను ట్రాక్ చేసే జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL), భూమి వైపు వస్తోన్న 1.3 కి.మీ పరిమాణంలో ఉన్న గ్రహశకలాన్ని గుర్తించింది. దీనిని ప్రమాదకరమైన వస్తువుగా నాసా పేర్కొంది. ఈ గ్రహశకలం..

Asteroid: భూమివైపు దూసుకొస్తోన్న పెను ప్రమాదం.. నాసా తీవ్ర హెచ్చరిక.. ఎప్పుడంటే?
13 Km Wide Asteroid
Follow us on

1.3 km Wide Asteroid: విశ్వంలోని వస్తువులను ట్రాక్ చేసే జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL), భూమి వైపు వస్తోన్న 1.3 కి.మీ పరిమాణంలో ఉన్న గ్రహశకలాన్ని గుర్తించింది. దీనిని ప్రమాదకరమైన వస్తువుగా నాసా పేర్కొంది. ఈ గ్రహశకలం మార్చి 4న 49,11,298 కి.మీ భూమికి దగ్గరగా రానున్నట్లు నాసా పేర్కొంది. భూమికి సమీపంలో ఉన్న వస్తువు 136971 (2001 CB21) సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దాని కక్ష్యను కేవలం 400 రోజుల్లో పూర్తి చేస్తుంది. భూగ్రహానికి అత్యంత సమీపంలో ఉన్న అంతరిక్ష వస్తువు గంటకు 43,238 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. చివరిసారిగా 2006లో గ్రహశకలం 61,71,250 కిలోమీటర్ల దూరంలో భూమికి దగ్గరగా వచ్చి వెళ్లినట్లు నాసా(NASA) పేర్కొంది.

గ్రహశకలం మార్చి 4న భూమిని సమీపించిన తర్వాత, అది భూమికి కేవలం 46,15,555 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీంతోనే మార్చి 2043లో దాని తదుపరి కక్ష్యను గుర్తించవచ్చు. వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్ ద్వారా ఈ గ్రహశకలానికి సంబంధించిన ఫొటోలను నాసా విడుదల చేసింది. జేపీఎల్ కక్ష్యను కనుగొన్న సమయంలో ఇటాలియన్ వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్ట్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జియాన్లూకా ఆంటీ అంతరిక్షంలో ఈ తేలియాడే వస్తువు ఫొటో తీయగలిగారు. భూమి ఆధారిత టెలిస్కోప్‌ని ఉపయోగించి, ఆంటీ భూమికి 35 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహశకలాన్ని బంధించారు.

136971 (2001 CB21)ని మొదటిసారిగా లింకన్ నియర్-ఎర్త్ ఆస్టరాయిడ్ రీసెర్చ్ (LINEAR) ప్రోగ్రాం పరిశీలించింది. ఇది 24 శాతం కంటే ఎక్కువ ప్రమాదకరమైన గ్రహశకలంగా గుర్తించారు. వీరి పరిశీలనలో 14 మిలియన్ల కంటే ఎక్కువ గ్రహశకలాలు, తోకచుక్కలతోపాటు 7,001 కొత్త వస్తువులు కనుగొన్నారు. వీటిలో, 142 గతంలో కనుగొన్నవని తేలింది. ఇందులో నాలుగు ప్రమాదకరమైన వస్తువులు ఉన్నట్లు, అలాగే ఎనిమిది కొత్త తోకచుక్కలు ఉన్నట్లు ఎన్‌ఈవో తెలిపింది.

గ్రహశకలం అంటే ఏమిటి?
గ్రహశకలాలు అంటే సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థ ఏర్పడిన తరువాత మిగిలిపోయిన రాతి శకలాలు. ఉల్క కదలికలను ట్రాక్ చేసే NASA జాయింట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL), మన గ్రహం భూమి నుంచి సూర్యునికి దూరం (భూమి-సూర్య దూరం) కంటే 1.3 రెట్లు తక్కువగా ఉన్నప్పుడు భూమికి దగ్గరగా ఉన్న వస్తువుగా గ్రహశకలాన్ని వర్గీకరిస్తుంది. అంటే దాదాపు 93 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న వాటిని గుర్తించి, అలర్ట్ చేస్తుంది.

భూమికి సమీపంలో ఉన్న 1000వ గ్రహశకలం (NEA)ని గుర్తించడంలో NASA గత ఏడాది ఒక మైలురాయిని చేరుకుంది. నాసా రాడార్లు 2021 PJ1ని గుర్తించాయి. 1968లో ప్రారంభమైన ఈ పరిశోధన.. చాలా కచ్చితత్వంతో ముందుకు సాగుతోంది. వేగంగా కదిలే వస్తువులను రాడార్ గుర్తించడంతోపాటు, ఖగోళ శాస్త్రవేత్తలు NEO కక్ష్యను అర్థం చేసుకోవడంలోనూ సహాయపడుతుంది. అలాగే ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటుందా లేదా అనేది ఖచ్చితంగా అంచనా వేయడంలోనూ తన సహాయం అదిస్తోంది.

Also Read: Flipkart TV Days: స్మార్ట్‌ టీవీ కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా.? ఓసారి ఈ ఆఫర్లపై లుక్కేయండి.. రూ. 8వేల నుంచి ప్రారంభం.

ఓలా ఎలక్ట్రిక్ పోటీగా మరో కొత్త స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌పై 120 కిలోమీటర్ల రేంజ్‌