తాప్సీ పై నెటిజన్ కామెంట్ .. గట్టిగా బుద్దిచెప్పిన హీరోయిన్

తెలుగులో 'ఝుమ్మంది నాదం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తాప్సీ. ఆ తర్వాత వరుసగా ఆవకాశాలు దక్కించుకున్నా.. ఈ అమ్మడికి సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు..

  • Sanjay Kasula
  • Publish Date - 3:46 pm, Wed, 25 November 20
తాప్సీ పై నెటిజన్ కామెంట్ .. గట్టిగా బుద్దిచెప్పిన హీరోయిన్

తెలుగులో ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తాప్సీ. ఆ తర్వాత వరుసగా ఆవకాశాలు దక్కించుకున్నా.. ఈ అమ్మడికి సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది ఈ చిన్నది. అక్కడ వరుసగా హిట్లు అందుకుంటూ.. టాప్ హీరోయిన్స్   లిస్ట్ లో చేరేందుకు ప్రయత్నిస్తుంది. అడపాదడపా తమిళ , తెలుగు సినిమాల్లో కనిపిస్తున్నా .. అమ్మడి దృష్టాంతా.. బాలీవుడ్ పైనే ఉంది.

ఇక తాప్సీ సొషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన సినిమా అప్ డేట్స్ తో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది . ప్రస్తుతం తాప్సీ ‘ర‌ష్మీ రాకెట్’ అనే సినిమా లో నటిస్తుంది . ఈ సినిమాలో తాప్సీ  అథ్లెట్ గా కనిపించనుంది. ఇందుకోసం కసరత్తులు చేస్తూ  కష్టపడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల జిమ్ చేస్తున్న ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తాప్సీ.  కొంతమంది అమ్మడి  కష్టాన్ని చూసి శభాష్ అంటుంటే మరికొంతమంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ తాప్సీ జిమ్ చేస్తున్న వీడియోపై కామెంట్ చేసాడు. ‘పొట్టి పొట్టి బట్టలు వేసుకొని గ్లామర్ షో చేయడం తప్ప నీలో అంతగా వెరైటీ ఏం  లేదు’ .. అంటూ అసభ్యకరంగా రాసుకొచ్చాడు. ఈ కామెంట్ పై స్పందించిన తాప్సీ అతడికి గట్టిగా  సమాధానం చెప్పింది.  ‘చూపించడం అంటే ఏంటి ..? నీకు నా టాలెంట్ చూపించాను. కానీ నీకు అది కనిపించదు..’ అంటూ బుద్ధి చెప్పింది ఈ వయ్యారి.