సుశాంత్‌ ఫ్యాన్స్ అనుకున్నది సాధించారు

సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్‌ బేచారా. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 24న విడుదలైన ఈ చిత్రానికి భారీ వ్యూస్ వచ్చాయి

సుశాంత్‌ ఫ్యాన్స్ అనుకున్నది సాధించారు
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 12:57 PM

Sushant Singh Dil Bechara: సుశాంత్ నటించిన చివరి చిత్రం దిల్‌ బేచారా. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఈ నెల 24న విడుదలైన ఈ చిత్రానికి భారీ వ్యూస్ వచ్చాయి. ప్రసారమైన 24 గంటల్లోనే ఈ మూవీ తొమ్మిదిన్నర కోట్ల వ్యూస్‌తో రికార్డు సాధించినట్లు ఓర్‌మ్యాక్స్‌(సినిమాలకు సంబంధించిన గణాంకాలను సేకరించి విశ్లేషించే సంస్థ) తెలిపింది. ఈ సంఖ్య ప్రముఖ వెబ్‌సిరీస్‌ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‌’తో పోల్చదగినదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా సుశాంత్‌కి నివాళిగా ఈ సినిమాను అందరు ఉచితంగా చూసేలా డిస్నీ+ హాట్‌స్టార్ అనుమతిని ఇచ్చింది. దీంతో అధిక సంఖ్యలో అభిమానులు ఈ చిత్రాన్ని చూశారు. అంతేకాదు సినిమా చూసే సమయంలో యాప్‌ కూడా క్రాష్ అయ్యింది. ఇక విడుదలకు ముందు అత్యధిక మంది చూసిన చిత్రంగా ‘దిల్‌ బేచారా’ను నిలపాలని సుశాంత్‌ ఫ్యాన్స్ నిర్ణయించుకోగా.. వారి కోరిక నెరవేరింది. కాగా గత నెల 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించగా.. ఆయన కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ముంబయి పోలీసుల విచారణ కొనసాగుతుండగా.. మరోవైపు సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ రియాపై సుశాంత్‌ తండ్రి బీహార్‌లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఎదురెదురుగా భూమి, చంద్రుడు.. ఫొటో తీసిన ‘తియోన్వెన్‌ 1’

Latest Articles