ఎదురెదురుగా భూమి, చంద్రుడు.. ఫొటో తీసిన ‘తియోన్వెన్‌ 1’

చైనా ప్రయోగించిన మొట్టమొదటి మార్స్‌ మిషన్‌ తియాన్వెన్‌ 1 ఈ నెల 24న సక్సెస్‌ఫుల్‌గా లాంచ్‌ అయిన విషయం తెలిసిందే.

ఎదురెదురుగా భూమి, చంద్రుడు.. ఫొటో  తీసిన 'తియోన్వెన్‌ 1'
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 12:21 PM

Tianwen-1 : చైనా ప్రయోగించిన మొట్టమొదటి మార్స్‌ మిషన్‌ తియాన్వెన్‌ 1 ఈ నెల 24న సక్సెస్‌ఫుల్‌గా లాంచ్‌ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రోబ్‌ లాంచ్ చేసిన 36 నిమిషాల్లోనే ఆర్బిటర్, రోవర్‌లతో పాటు స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ మార్స్ ట్రాన్స్ ఫర్ ఆర్బిటర్‌ని చేరుకుందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) తెలిపింది. ఇక తాజాగా ఈ ప్రోబ్‌  అక్కడి నుంచి భూమి, చంద్రుడి ఫొటోలను తీసింది. వాటిని చైనా నేషనల్ స్పేష్ అడ్మినిస్ట్రేషన్‌ మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ”భూమికి 1.2 మిలియన్ కిలోమీటర్ల దూరంలో తియాన్వెన్‌ 1 తీసిన భూమి, చంద్రుడి ఫొటోలు” అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఈ ఫొటోను షేర్ చేసిన చైనా ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్‌ పర్సన్‌ హువా చున్‌యింగ్..‌ ”విశాల అంతరిక్షంలో భూమి, చంద్రుడు ఎదురెదురుగా ఉన్నాయి” అని కామెంట్ పెట్టారు.

Read This Story Also: నిండు గర్భిణికి కరోనా.. 108 వాహనంలోనే ప్రసవం