Breaking News
  • కడప: ఫాతిమా ఆస్పత్రిని కోవిడ్‌ ఆస్పత్రిగా ప్రకటన. పాజిటివ్ వచ్చినవారికి ఫాతిమా ఆస్పత్రిలో చికిత్స. పాజిటివ్ కుటుంబ సభ్యులను క్వారంటైన్లకు తరలింపు.
  • హైదరాబాద్: శ్రీరామనవమి వేడుకలను ఇళ్లలోనే జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్‌ పిలుపు. విజయవాడ: మద్యానికి బానిసలైన వారి పట్ల కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలి, అనధికార మత్తు పదార్థాల విక్రయాలు జరిపితే ఫోన్‌ చేయాల్సిన నెం.18004254868, 9491030853, 08662843131కు కాల్‌ చేయండి-ఏపీ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ.
  • కృష్ణాజిల్లా: కరోనాపై అప్రమత్తంగా ఉండాలి. దయచేసి ఎవరూ బయటకు రావొద్దు-మంత్రి పేర్నినాని. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మన చుట్టూనే వైరస్‌ పొంచి ఉంది-మంత్రి పేర్నినాని.
  • తాడేపల్లి: కరోనాపై సీఎం జగన్‌ సమీక్ష. కేసులు పెరగడంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. ఢిల్లీ వెళ్లి వచ్చినవారందరినీ గుర్తించి పరీక్షలు చేయాలన్న సీఎం.
  • వరంగల్ రూరల్: పర్వతగిరిలో గడపగడపకు వెళ్లి కరోనాపై అవగాహన కల్పించిన మంత్రి ఎర్రబెల్లి, మాస్కులు పంపిణీ చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు.

Mahesh Babu: అప్పుడే హీరో అవ్వాలని నిర్ణయించుకున్నా..!

Superstar latest news, Mahesh Babu: అప్పుడే హీరో అవ్వాలని నిర్ణయించుకున్నా..!

Mahesh Babu: హీరో అవ్వాలని తనలో ఎప్పుడు బీజం పడిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. తన తండ్రి కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసినప్పుడు తాను కూడా హీరో అవ్వాలని భావించానని అన్నారు. హీరోగా తనను ఇన్‌స్పైర్ చేసింది కూడా తన తండ్రి అని మహేష్ తెలిపారు. తాను సంతోషంగా ఉండేందుకు తన కుటుంబమే కారణమని మహేష్ పేర్కొన్నారు. ఇక తనకు సిగ్గు ఎక్కువని.. సెన్సిటివ్ పర్సన్‌ను అంటూ మహేష్ తన గురించి వెల్లడించారు. సోషల్ మీడియాలో తనను ప్రస్తావిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఓ వీడియో ద్వారా సమాధానం ఇచ్చారు. ఇక క్యాజువల్స్ అంటేనే తనకు చాలా ఇష్టమని మహేష్ అన్నారు.

కాగా ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరుతో హిట్ కొట్టిన మహేష్.. రెండో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్లలో మాత్రం సత్తా చాటింది. ఇక ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన మహేష్.. ఫ్యామిలీతో విదేశీ యాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నారు మహేష్. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఇందులో మహేష్ డ్యూయల్ రోల్‌లో నటించబోతున్నట్లు టాక్.

Related Tags