Breaking News
  • దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాల అభ్యంతరం. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు లేఖ రాసిన మహిళా సంఘాలు. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్‌ చేస్తారని లేఖ. కోర్టులో కేసు నడుస్తుండగా చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు. ఎన్‌కౌంటర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి. మృత దేహాలకు ఫోరెన్సిక్‌ నిపుణులతో పోస్టుమార్టం చేయించాలి. పోస్టుమార్టం వీడియో తీయించాలి-లేఖలో మహిళా సంఘాలు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అందుబాటులో లేకపోవడంతో సోమవారం విచారిస్తామన్న హైకోర్టు.
  • కేంద్రీయ సైనిక్‌ బోర్డ్‌కు పవన్‌కల్యాణ్‌ విరాళం. కోటి రూపాయలు విరాళం ప్రకటించిన పవన్‌కల్యాణ్‌. స్వయంగా ఢిల్లీ వెళ్లి డీడీ అందిస్తా-పవన్‌కల్యాణ్‌.
  • ఎన్‌కౌంటర్లు సమస్యకు పరిష్కారం కాదు-ట్విట్టర్‌లో ఆర్జీవీ. సమాజంలో ఉద్రేకాలను తగ్గించేందుకు ఎన్‌కౌంటర్లు దోహదం చేయొచ్చు-ట్విట్టర్‌లో రామ్‌గోపాల్‌వర్మ.
  • తూ.గో: ఆంధ్రా పాలిటెక్నిక్‌ కాలేజ్‌లో విద్యార్థులపై దాడి. విద్యార్థులపై దాడి చేసిన బయటి వ్యక్తులు. ఇద్దరు విద్యార్థులకు గాయాలు పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు.
  • గుంటూరు: పిడుగురాళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. లెక్కలు చూపని రూ.56,700 స్వాధీనం, కేసు నమోదు.
  • ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది-చంద్రబాబు ట్వీట్‌. ఉల్లి ధరలతో జనం అల్లాడుతుంటే దేశమంతా ధరలు పెరిగాయని వైసీపీ మంత్రులు చెప్పడం హాస్యాస్పదం-ట్విట్టర్‌లో చంద్రబాబు. ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని దళారుల రాజ్యంగా మార్చారు. ఒక్క ఉల్లి మాత్రమే కాదు.. నిత్యావసరాల ధరలన్నీ చుక్కలనంటాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది. ఉల్లి కోస్తే వచ్చే కన్నీళ్లు.. ఉల్లిని కొంటున్నప్పుడే వస్తున్నాయి. ఉల్లి ధరల తడాఖా ఏంటో స్థానిక సంస్థల్లో మహిళలు చూపిస్తారు -ట్విట్టర్‌లో చంద్రబాబు
  • మహబూబ్‌నగర్‌: దిశ నిందితుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి. రాత్రికి మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రిలోనే నిందితుల మృతదేహాలు. రేపు మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్‌హెచ్ఆర్సీ ప్రతినిధులు. ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధుల బృందం పరిశీలించిన తర్వాతే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు. మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రి దగ్గర భారీగా పోలీస్‌ బందోబస్తు.

‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ..! నవ్వు తెప్పించాడా..?

Sundeep Kishan's Tenali Ramakrishna BA BL movie review, ‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ..! నవ్వు తెప్పించాడా..?

టైటిల్: తెనాలి రామకృష్ణ బిఏ, బిఎల్
యాక్టర్స్: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్ కుమార్, అయ్యప్ప, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు
డైరెక్టర్: జి నాగేశ్వర్ రెడ్డి
ప్రొడ్యూసర్స్: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీష్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
మ్యూజిక్: సాయి కార్తిక్
డైలాగ్స్: నివాస్, భవానీ ప్రసాద్
కథ : టి రాజసింహ
విడుదల తేదీ: 15.11.2019

టాలీవుడ్‌లో సందీప్ కిషన్‌కి మంచి పేరుంది. మొదటి నుంచీ.. విచిత్రమైన కథలను ఎంచుకుంటూ.. చిత్ర పరిశ్రమలో బాగానే పేరు సంపాదించాడు. అలాగే.. కామెడీపై దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డికి మంచి పట్టుంది. ప్రతీ సినిమాలో తన మార్క్‌ని చూపిస్తూంటారు. మరి వీరిద్దరి కాంబినేషన్‌ అంటే.. సినిమాపై భారీగానే అంచనాలుంటాయి. మరి.. వీరి కాంబోలో వచ్చిన సరికొత్త ‘తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్’ సినిమాలో సందీప్ సక్సెస్ అయ్యాడా..? డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి తన మార్క్‌ను చూపించారా..? అన్నది తెలియాలంటే.. కథలోకి వెళ్లాల్సిందే.

Sundeep Kishan's Tenali Ramakrishna BA BL movie review, ‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ..! నవ్వు తెప్పించాడా..?

కథ: సందీప్ కిషన్ ఓ లాయర్. కోర్టులో కేసు వాదించి.. మంచి లాయర్‌గా పేరు సంపాదించాలని అతని కోరిక. కానీ.. మొదటి నుంచీ సందీప్‌కి ఒక్క కేసు కూడా రాదు. దీంతో.. చాలా ఆఫర్లు ప్రకటిస్తాడు. అయినా ప్రయోజనం ఉండదు. ఇలా సాగుతుండగా.. అతనికి హన్సిక పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు సందీప్. హన్సికతో ప్రేమాయణం కొనసాగిస్తూనే.. పెండింగ్ కేసుల గురించి తెలుసుకొని.. ఇరు వర్గాల్ని రాజీ చేస్తూ.. సొమ్ము చేసుకుంటూంటాడు. ఈ సందర్భంలోనే అనుకోకుండా.. పొలిటికల్ లీడర్‌ అయిన.. వరలక్ష్మి కేసును ఒప్పుకుంటాడు. ఈ కేసే సందీప్ జీవితాన్ని రివర్స్ చేస్తుంది. మొత్తానికి ఏదోవిధంగా ఆమెను గెలిపిస్తాడు లాయర్ సందీప్. అయితే.. కేసు గెలిచాక.. మరో ట్విస్ట్ బయటపడుతుంది. అసలు ఇంతకీ.. ఆ ట్విస్ట్ ఏంటి..? ఆ గొడవలన్నింటి నుంచీ సందీప్ బయటపడ్డాడా? ఈ సినిమాలో వరలక్ష్మి రోల్ ఏంటి..? అనేది తెలుసుకోవాలంటే.. సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: అసలు ఈ సినిమాను డైరెక్టర్.. ఏ వ్యూహంతో తీశాడో అర్థం కాలేదు. ఈ సినిమాలో కామెడీ కంటే.. సాగతీతలే ఎక్కువగా ఉన్నాయి. అలాగని.. సస్పెన్స్‌లు కూడా ఏమీ లేవు. అక్కడక్కడ హాస్య సన్నివేశాలు ఉన్నా.. ప్రేక్షకులకు మాత్రం అవి కనెక్ట్ కాలేదు. చాలా సాదాసీదా సినిమా అనే చెప్పవచ్చు. తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ టైటిల్‌కు తగినట్టుగా ఈ మూవీ ఉందా..! అన్నది సందేహమే.

Sundeep Kishan's Tenali Ramakrishna BA BL movie review, ‘తెనాలి రామకృష్ణ’ మూవీ రివ్యూ..! నవ్వు తెప్పించాడా..?

నటీనటులు: సందీప్‌ కిషన్ సాధారణంగానే.. తన పాత్రకు న్యాయం చేసి.. ఎమోషన్స్‌ని పండించాడు. అయితే.. కామెడీ టైమింగ్ మాత్రం సందీప్‌కి అస్సలు సూటవ్వలేదు. క్లైమాక్స్‌కి ముందు సందీప్ 20 నిమిషాల వరకూ స్క్రీన్‌పై కనిపించడు. అలాగే.. హన్సిక పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల్లో మాత్రం అందంగా కనిపించింది. అసలు ఆమె పాత్ర.. సినిమాకి అనవసరం అనిపించింది. ఇక వరలక్ష్మీ పాత్రకి ఏదో బిల్డప్‌ ఇచ్చినట్టు చూపించినా.. చాలా సాదా సీదాగా ఉంది. ఆమెకిచ్చిన రోల్‌లో సీరియస్ నెస్ లేదు. ఇక వెన్నెల కిషోర్.. అన్నపూర్ణమ్మ, వై విజియ, రఘబాబు, సప్తగిరి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్:

కొన్ని కామెడీ సీన్స్
సెకండ్‌ ఆఫ్

మైనస్ పాయింట్స్:

కథ
స్క్రీన్ ప్లే
కథలో కరువైన సీరియస్ నెస్
అనవసర పాత్రలు