
Yuzvendra Chahal Roka Ceremony: టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చాహల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ప్రముఖ యూట్యూబర్, డాక్టర్, కొరియోగ్రాఫర్ ధనుశ్రీ వర్మను చాహల్ మనువాడబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోకా కార్యక్రమం జరగ్గా.. ఆ ఫొటోలను చాహల్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దానికి.. ”మా కుటుంబాలతో కలిసి మేము ఓకే చెప్పాం” అని కామెంట్ పెట్టారు. దివ్యశ్రీ సైతం అవే ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా గత కొన్ని రోజులుగా ధనుశ్రీతో ప్రేమలో ఉన్న చాహల్.. గతంలో ఆమె వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన చాహల్.. త్వరలో బ్యాట్ పట్టబోతున్నారు. యూఏఈలో జరగబోతున్న ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున చాహల్ ఆడబోతున్నారు.
Read This Story Also: పీసీసీ ఉపాధ్యక్షుడు ఆదిరాజు ఆకస్మిక మృతి