Yash Chandra Prakash: ధోని స్ఫూర్తితో UPSCలో సక్సెస్! ఇప్పుడు నాగర్ కర్నూల్‌ ఎఫ్‌డీఓగా..

Yash Chandra Prakash Success Story: ఎలాంటి కోచింగ్ లేకుండా స్వయంకృషితో UPSCకి సిద్ధమైన యశ్ చంద్ర ప్రకాష్, 2024 ఫలితాల్లో IFS విభాగంలో 37వ ర్యాంకు సాధించారు. ఆరేళ్ల పాటు ఎన్నో ప్రయత్నాలు, వైఫల్యాలను ఎదుర్కొన్నా పట్టువదల్లేదు. ధోనీ స్ఫూర్తి, తండ్రి ఆదర్శంతో లక్ష్యాన్ని చేరుకుని ప్రస్తుతం అమ్రాబాద్ FDOగా సేవలందిస్తున్నారు. యువతకు ఆయన ప్రయాణం గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.

Yash Chandra Prakash: ధోని స్ఫూర్తితో UPSCలో సక్సెస్! ఇప్పుడు నాగర్ కర్నూల్‌ ఎఫ్‌డీఓగా..
Yash Chandra Prakash

Updated on: Aug 23, 2026 | 10:55 AM

Yash Chandra Prakash: లక్ష్య సాధన కోసం నిరంతర శ్రమతో పట్టువదలకుండా ముందుకు సాగితే గమ్యాన్ని తప్పక చేరుకోవచ్చని ఎఫ్‌డీవో యశ్ చంద్ర ప్రకాష్ నిరూపించారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన, ఉద్యోగ ప్రయత్నాల్లో ఎన్నోసార్లు ఓటములు ఎదురైనా నిరాశ చెందలేదు. ఆరేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత అనుకున్న లక్ష్యాన్ని సాధించి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. మూగజీవులు, వన్యప్రాణులపై ఉన్న ప్రేమ యశ్ చంద్ర ప్రకాష్‌ను అటవీశాఖ వైపు నడిపించింది. 2017 నుంచి యూపీఎస్సీకి సిద్ధమైన ఆయన ఎలాంటి కోచింగ్ సెంటర్‌కు వెళ్లలేదు. ఇంట్లోనే ఉంటూ స్వయంగా నోట్స్ రాసుకుని చదివారు. రోజుకు దాదాపు పది గంటల పాటు కఠోర సాధన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అనేకసార్లు ప్రయత్నించినా తొలినాళ్లలో ఫలితం దక్కలేదు. అయినా ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా నిలబడ్డారు.

నాన్నే నా రోల్ మోడల్

తన విజయంలో తండ్రి ప్రకాష్ పాత్ర ఎంతో కీలకమని యశ్ వెల్లడించారు. పెద్దగా చదువుకోకపోయినా వ్యాపారంలో విజయం సాధించిన తండ్రి జీవితమే తనకు ప్రధాన ఆదర్శమని చెప్పారు. అలాగే ఎంఎస్ ధోనీ సినిమా తనలో అమితమైన స్ఫూర్తిని నింపిందని గుర్తుచేసుకున్నారు. రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లాకు చెందిన వీరి కుటుంబం పాతికేళ్ల కిందట గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి వలస వెళ్లింది. యశ్ విద్యాభ్యాసమంతా అక్కడే సాగింది. 2017లో ఇందిరాగాంధీ జాతీయ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పూర్తి చేశారు.

ఇది కూడా చదవండి: AUS VS BAN: ఆస్ట్రేలియా వెళ్లి.. వాళ్లకే చుక్కలు చూపించాడు! చరిత్ర సృష్టించిన బంగ్లా బౌలర్!

స్నేహితుడి సలహాతో మలుపు తిరిగిన ప్రయాణం

యూపీఎస్సీకి సిద్ధమవుతున్న సమయంలో స్నేహితుడి ఇచ్చిన సలహా ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 2023లో హర్యానా గ్రూప్-1 పరీక్ష రాసి బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఉద్యోగం చేస్తూనే మరింత పట్టుదలతో చదివి 2024 యూపీఎస్సీ ఫలితాల్లో ఐఎఫ్ఎస్ విభాగంలో జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు సాధించారు. ముస్సోరీ, డెహ్రాడూన్‌లలో శిక్షణ పూర్తయ్యాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూపాలపల్లిలో రేంజ్ ఆఫీసర్‌గా పనిచేసి ప్రస్తుతం అమ్రాబాద్ ఎఫ్‌డీవోగా బాధ్యతలు స్వీకరించారు.

ఇది కూడా చదవండి: Ravindra Jadeja: కొలంబో వేదికగా జడేజా చారిత్రాత్మక రికార్డు.. తొలి భారతీయ క్రికెటర్‌గా అరుదైన ఘనత

ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధం

యువత ఏ రంగాన్ని ఎంచుకున్నా లక్ష్యాన్ని ముద్దాడే వరకు శ్రమించాలని యశ్ పిలుపునిచ్చారు. అడ్డంకులు ఎదురైనప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని సూచించారు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, ఆయన భార్య అంజలి ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. మానసికోల్లాసం కోసం టెన్నిస్, క్రికెట్ ఆడే యశ్.. ఉత్తర భారత వంటకం రాజ్‌మాతో పాటు తెలంగాణ స్టైల్ బెండకాయ, చిక్కుడుకాయ కూరలను ఎంతో ఇష్టంగా తింటారు. ఎలాంటి కోచింగ్ లేకుండా కేవలం స్వయం సాధన, పట్టుదలతో ఐఎఫ్ఎస్ సాధించిన యశ్ చంద్ర ప్రకాష్ ప్రయాణం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వేలాది మంది యువతకు గొప్ప స్ఫూర్తిదాయకం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us