సెంచరీతో హీలీ కెప్టెన్ ఇన్నింగ్.. ఉమెన్స్ వరల్డ్ కప్‌లో పోరాడి ఓడిన భారత్!
మహిళల ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి టీమ్ ఇండియా ఆశలు గల్లంతు చేసింది. విశాఖపట్నంలో జరిగిన ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ చేసిన అద్భుతమైన సెంచరీకి ప్రపంచ కప్‌లో మరో పరాభవం తప్పలేదు

మహిళల ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా మరోసారి టీమ్ ఇండియా ఆశలు గల్లంతు చేసింది. విశాఖపట్నంలో జరిగిన ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ చేసిన అద్భుతమైన సెంచరీకి ప్రపంచ కప్‌లో మరో పరాభవం తప్పలేదు. వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదనతో ఆసీస్ జట్టు రికార్డు నెలకొల్పింది.
ఆస్ట్రేలియా మహిళా జట్టు టీమ్ ఇండియాను 3 వికెట్ల తేడాతో ఓడించింది. హీలీ సెంచరీ సహాయంతో, ఆస్ట్రేలియా 331 పరుగుల కష్టతరమైన లక్ష్యాన్ని ఛేదించింది. మహిళల వన్డే చరిత్రలో అత్యధిక విజయవంతమైన పరుగుల వేట రికార్డును ఆస్ట్రేలియా సృష్టించింది. ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాకు ఇది మూడవ విజయం కాగా, భారతదేశం వరుసగా రెండవ ఓటమి. ఓపెనర్ల మెరుపులతో టీమిండియా భారీ స్కోర్ చేసినా.. ఎలీసా హెలీ(142) సెంచరీతో చెలరేగి లక్ష్యాన్ని ఛేదించింది.. ఆమెకు ఎలీసా పెర్రీ(47 నాటౌట్), గార్డ్‌నర్ (45)లు జత కలిశారు. స్నేహ్ రానా ఓవర్లలో పెర్రీ సిక్సర్‌తో కంగారూ టీమ్‌కు చిరస్మరణీయ విక్టరీని అందించింది.
అక్టోబర్ 12వ తేదీ ఆదివారం జరిగిన ఈ సూపర్ మ్యాచ్ నుండి అందరూ అద్భుతమైన వినోదాన్ని ఆశించారు. సరిగ్గా అదే జరిగింది. రెండు జట్లు కలిసి మ్యాచ్ అంతటా సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించారు. రెండు జట్లు కలిపి మొత్తం 661 పరుగులు సాధించాయి. అయితే, తమ సొంత అభిమానుల ముందు ఆడుతున్న టీం ఇండియా ఓటమిని చవిచూసింది. చివరికి, ఆస్ట్రేలియా మరోసారి తాము ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ల ఆటతీరును ప్రదర్శించింది.
Just Australia things 🔥 pic.twitter.com/t0heMFwGNF
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2025
అంతకుముందు ఈ టోర్నీలో తొలి ఓటమి నుంచి తేరుకున్న భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (80), ప్రతీకా రావల్ (75) దూకుడుగా ఆడటంతో ఆస్ట్రేలియా ముందు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 155 రన్స్ జోడించి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (33), రీచా ఘోష్ (32)లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో భారత్ స్కోర్ 300 దాటింది. కానీ, టెయిలెండర్లు అనవసర షాట్లకు యత్నించి వెంటవెంటనే పెవిలియన్ దారి పట్టారు. 49వ ఓవర్లో క్రాంతి గౌడ్ వికెట్ తీసిన సథర్‌లాండ్ ఆ తర్వాతి బంతికే శ్రీచరణిని క్లీన్ బౌల్డ్ చేయడంతో 330 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగించింది.
2 close games. 2 back-to-back defeats for India.
What needs fixing? pic.twitter.com/MdGQuRtpn1
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




