వయసు కొంచెం..ప్రతిభ ఘనం..15 ఏళ్లకే వింబుల్డన్‌ బరిలోకి!

|

Jun 29, 2019 | 2:43 AM

లండన్‌: వింబుల్డన్‌.. టెన్నిస్‌ చరిత్రలోనే వింబుల్డన్‌కు ఒక సపరేట్ చరిత్ర ఉంటుంది. వివిధ దేశాల్లోని దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటూ ఉంటారు.దీనికి అర్హత సాధించాలంటే కఠోర శ్రమ, సాధన అవసరం. ఆ తర్వాత అర్హత పోటీల్లో విజయం సాధించాలి. ఇలా ఏటా క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొన్నా మెయిన్‌ డ్రాకు అర్హత పొందని వాళ్లు చాలా మందే ఉన్నా రు. అయితే, 15 ఏళ్లకే వింబుల్డన్‌ మెయిన్‌ డ్రాలో ఆడే అవకాశం దక్కించుకొని టెన్నిస్‌ ఓపెన్‌ ఎరాలో […]

వయసు కొంచెం..ప్రతిభ ఘనం..15 ఏళ్లకే వింబుల్డన్‌ బరిలోకి!
Follow us on

లండన్‌: వింబుల్డన్‌.. టెన్నిస్‌ చరిత్రలోనే వింబుల్డన్‌కు ఒక సపరేట్ చరిత్ర ఉంటుంది. వివిధ దేశాల్లోని దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటూ ఉంటారు.దీనికి అర్హత సాధించాలంటే కఠోర శ్రమ, సాధన అవసరం. ఆ తర్వాత అర్హత పోటీల్లో విజయం సాధించాలి. ఇలా ఏటా క్వాలిఫయింగ్‌ టోర్నీలో పాల్గొన్నా మెయిన్‌ డ్రాకు అర్హత పొందని వాళ్లు చాలా మందే ఉన్నా రు. అయితే, 15 ఏళ్లకే వింబుల్డన్‌ మెయిన్‌ డ్రాలో ఆడే అవకాశం దక్కించుకొని టెన్నిస్‌ ఓపెన్‌ ఎరాలో సరికొత్త చరిత్ర సృష్టించింది అమెరికా టీనేజర్‌ కోరి గాఫ్‌.

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా క్వాలిఫయింగ్‌ పోటీలకు ఎంపికైన గాఫ్‌ గురువారం జరిగిన తుది రౌండ్‌ మ్యాచ్‌లో 6–1, 6–1తో 19వ సీడ్‌ మిన్నెన్‌(బెల్జియం)పై గెలుపొం దింది. కాగా, గాఫ్‌ కంటే ముందు 15 ఏళ్లకే వింబుల్డన్‌ మెయిన్‌ డ్రాలో ఆడిన వారు 11 మం ది ఉండగా, వీరందరూ కూడా వైల్డ్‌కార్డ్‌ ద్వారా అవకాశం దక్కించుకున్నవారే.