కోహ్లీ ‘ఛాలెంజ్’.. రవిశాస్త్రి స్పైసీ మసాలా

వైరల్ ట్రెండ్స్, సరికొత్త ఛాలెంజ్స్‌కు సోషల్ మీడియా అతి పెద్ద ప్లాట్‌ఫామ్‌గా మారింది. అందులో భాగంగా కొద్దిరోజుల క్రిందట ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. పిల్లల నుంచి ప్రముఖుల వరకు సామాజిక మాధ్యమాల్లో తాము చేసిన విన్యాసాల్ని వీడియోల రూపంలో పోస్ట్ చేశారు. లేట్‌ వచ్చినా లేటెస్ట్‌గా వచ్చానని అన్నట్లు ఈ జాబితాలోకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు. ఇక అందరిలానే కాకుండా విరాట్ కొంచెం డిఫరెంట్‌గా ఈ ‘బాటిల్‌ […]

కోహ్లీ ఛాలెంజ్.. రవిశాస్త్రి స్పైసీ మసాలా

Updated on: Aug 11, 2019 | 4:29 PM

వైరల్ ట్రెండ్స్, సరికొత్త ఛాలెంజ్స్‌కు సోషల్ మీడియా అతి పెద్ద ప్లాట్‌ఫామ్‌గా మారింది. అందులో భాగంగా కొద్దిరోజుల క్రిందట ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. పిల్లల నుంచి ప్రముఖుల వరకు సామాజిక మాధ్యమాల్లో తాము చేసిన విన్యాసాల్ని వీడియోల రూపంలో పోస్ట్ చేశారు. లేట్‌ వచ్చినా లేటెస్ట్‌గా వచ్చానని అన్నట్లు ఈ జాబితాలోకి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు. ఇక అందరిలానే కాకుండా విరాట్ కొంచెం డిఫరెంట్‌గా ఈ ‘బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌’ను చేయడం విశేషం. ఈ ఛాలెంజ్‌ను కోహ్లీ తన బ్యాట్‌తో పూర్తి చేశాడు.

కోహ్లీ.. తాను చేసిన ఈ ఛాలెంజ్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అటు ఈ వీడియోకి కోచ్‌ రవిశాస్త్రి బ్యాక్‌గ్రౌండ్‌ కామెంట్రీ తోడవ్వడం విశేషం. ‘ఎప్పటికీ చేయకపోవడం కన్నా ఆలస్యంగానైనా చేశా’ అంటూ కోహ్లీ దీనికి క్యాప్షన్ ఇచ్చాడు. ఇంకేముంది ఫ్యాన్స్ విపరీతంగా ఈ వీడియోకు లైకులు, కామెంట్స్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.