ICC Rankings: టీమిండియా సారథికి అరుదైన గౌవరం.. ఈ దశాబ్దపు ఐసీసీ వన్డే క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ..

|

Dec 28, 2020 | 3:32 PM

భారత క్రికెట్ జట్టు సారథి, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఖాతాలో అరుదైన అవార్డు వచ్చి చేరింది. దశాబ్దపు క్రికెట్ చరిత్రలో వన్డేల...

ICC Rankings: టీమిండియా సారథికి అరుదైన గౌవరం.. ఈ దశాబ్దపు ఐసీసీ వన్డే క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ..
Follow us on

ICC Rankings: భారత క్రికెట్ జట్టు సారథి, రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం లభించింది. దశాబ్దపు క్రికెట్ చరిత్రలో వన్డేల విభాగంలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్‌ అంటూ ఐసీసీ ప్రకటించింది. దశాబ్ద కాలంలో జరిగిన వన్డేల్లో పదివేలకు పైగా పరుగులు చేసిన ఏకైక వ్యక్తిగా విరాట్ నిలిచాడు. దాంతో కోహ్లీని ఈ అవార్డు వరించింది. కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 30 సెంచరీలు చేయగా, 48 ఆర్థ సెంచరీలు చేశాడు. కాగా, పితృత్వపు సెలవుపై ఆస్ట్రేలియా టూర్‌ నుంచి భారత్‌కు వచ్చిన విరాట్.. ఐసీసీ అవార్డుపై స్పందించాడు. ‘జట్టు విజయం సాధించాలనేదే నా తపన. అందుకోసం ప్రతి ఆటలోనూ నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఆ మేరకు ఒక వీడియో విడుదల చేశాడు.

ఇదిలాఉండగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి మరో అవార్డు కూడా లభించింది. ఈ దశాబ్దపు ఐసిసి వన్డే క్రికెట్‌లో ఉత్తమ క్రికెటర్‌గా నిలిచినందుకు గానూ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డును విరాట్ గెలుచుకున్నాడు. దశాబ్ద కాలంలో ఏ క్రికెటర్ చేయనంతగా విరాట్ 20,396 పరుగులు చేసి వాహ్ అనిపించుకున్నాడు. ఇక 66 సెంచరీలు చేయగా, 94 అర్థ శతకాలు బాదాడు.

 

Also read:

ఈ దశాబ్దపు ఉత్తమ జట్లను ప్రకటించిన ఐసీసీ..అన్ని ఫార్మెట్లకు సారథులుగా టీమిండియా ఆటగాళ్లు

ఐసీసీ ఈ దశాబ్దపు మహిళా జట్లలో నలుగురు భారతీయులు.. మిథాలీరాజ్, ఝులన్ గోస్వామిలతోపాటు యువ ఆటగాళ్ల పేర్లు

 

ICC Tweets: