విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (200; 295 బంతుల్లో 28X4) ద్విశతకంతో కదం తొక్కాడు. ఓవర్‌నైట్ స్కోర్ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె(59; 168బంతుల్లో 8×4)తో కలిసి నాలుగో వికెట్‌కు 178 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలో రహానె అర్ధశతకం తర్వాత మహారాజ్ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(26; 66 బంతుల్లో 2×4)తో కలిసిన కోహ్లీ మరో 107 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. ఈ ద్విశతకంతో కోహ్లీ ఏడు వేల పరుగుల మైలురాయిని కూడా అందుకోవడం విశేషం. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అత్యధికంగా డాన్ బ్రాడ్ మాన్ 12 డబుల్ సెంచరీలు సాధించాడు.
India vs South Africa- 2nd Test: Virat Kohli has scored his 7th double hundred; India 502/4 on Day 2 in Pune pic.twitter.com/DahmPrITSa
— ANI (@ANI) October 11, 2019
2️⃣0️⃣0️⃣*
Virat Kohli registers his seventh double hundred in Tests. He also reaches 7000 runs in the format.
Master ?
Follow #INDvSA LIVE ▶️ https://t.co/MO1tirNpXK pic.twitter.com/JgfLVIbJu1
— ICC (@ICC) October 11, 2019