ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రియులను ఫిఫా వరల్డ్ కప్ అలరిస్తోంది. లీగ్ దశ ముగిసి క్వార్టర్ ఫైనల్స్ దశకు చేరుకుంది. అర్జెంటీనా, క్రొయేషియా జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. దేశాలతో సంబంధం లేకుండా.. తమ అభిమాన ఆటగాళ్ల ప్రదర్శనకు ఫుట్‌బాల్ అభిమానులు ఫిదా అవుతున్నారు. కొంతమంది దేశాలకు మద్దతిస్తుంటే.. మరొకొంతమంది దేశాలకు అతీతంగా అత్యుత్తమ ఆటగాళ్లకు మద్దతు పలుకుతున్నారు. ఫిఫా వరల్డ్ కప్‌లో భారత ఆడకపోయినప్పటికి.. వివిధ రాష్ట్రాలకు చెందిన భారత ఫుట్‌బాల్ అభిమానులు తమ అభిమాన జట్లకు, క్రీడాకారులకు మద్దతు పలుకు తున్నారు. ముఖ్యంగా కేరళలో అయితే ఫిఫా వరల్డ్ కప్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను విశ్వవ్యాప్తంగా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో.. భారత మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ ఫుట్‌బాల్ ఆడుతూ.. తన క్రికెట్ అభిమానులతో పాటు ఫుట్‌బాల్ అభిమానులను అలరించాడు.
ఫిఫా ప్రపంచ కప్ నేపథ్యంలో తాను ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేశాడు టెండూల్కర్. గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ.. బంతిని తన్నుతూ పరిగెత్తడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోకు తన మనసులో ఫుట్‌బాల్ అనే క్యాప్షన్ పెట్టాడు.
కొద్ది గంటల క్రితం షేర్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. క్రికెట్ గాడ్ ఫుట్‌బాల్ గాడ్‌గా మారారంటూ కొంతమంది.. సచిన్ గ్రేట్ అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న టైంలో సచిన్ టెండూల్కర్ తాను ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి తన అభిమానులను అలరించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..