Vinesh Phogat: ‘నోర్మూసుకుని.. ఓ మూలన కూర్చుని ఏడవండి’ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఫైర్‌! ఏం జరిగిందంటే..

కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ ప్యారీస్‌ ఒలంపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన సగతి తెలిసిందే. అయితే ఆమె బరువు తగ్గించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. చివరికి జుట్టు కూడా కత్తిరించుకుంది. అయినా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఫైనల్‌ చేరినా రిక్తహస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది..

Vinesh Phogat: నోర్మూసుకుని.. ఓ మూలన కూర్చుని ఏడవండి రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ ఫైర్‌! ఏం జరిగిందంటే..
Vinesh Phogat

Updated on: Apr 14, 2025 | 11:19 AM

హరియాణా, ఏప్రిల్‌ 14: ప్రముఖ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ ప్యారీస్‌ ఒలంపిక్స్‌లో అధిక బరువు కారణంగా తుది పోరులో అనర్హత వేటుకు గురైన సంగతి తెలిసిందే. కేవలం 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమె వెనుదిరగాల్సి వచ్చింది. బరువు తగ్గించుకోవడానికి ఆమె అన్ని ప్రయత్నాలు చేసింది. చివరికి జుట్టు కూడా కత్తిరించుకుంది. అయినా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఫైనల్‌ చేరినా రిక్తహస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో అప్పట్లో పెద్ద చర్చే సాగింది. తాజాగా హరియాణా ప్రభుత్వం రజత పతకం సాధించిన వారికి ఇచ్చినట్లే వినేష్‌కి కూడా రూ.4 కోట్ల నగదు బహుమతిని ఇవ్వాలని నిర్ణయించింది.

అయితే హర్యానా ప్రభుత్వం ఒలింపిక్స్ రజత పతక విజేతకు సమానమైన ప్రయోజనాలు వినేశ్‌ అందించేందుకు రూ. 4 కోట్ల నగదు బహుమతితోపాటు మరో రెండు ఛాయిస్‌లు కూడా ఇచ్చింది. గ్రూప్ ‘ఎ’ కింద క్రీడా కోటాలో ఉద్యోగం, హర్యానా షెహ్రీ వికాస్ ప్రాధికారన్ ప్లాట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం నయాబ్‌ సింగ్‌ సైనీ క్యాబినెట్ ప్రకటించింది. కానీ వినేశ్‌ రూ.4 కోట్ల నగదు బహుమతిని తీసుకోవడానికి అంగీకారం తెలిపింది. దీంతో రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయ్యి ఉండి బీజేపీ ప్రభుత్వం ఇచ్చే నగదు బహుమతి ఎలా అందుకుంటావ్‌? అంటూ ట్రోల్ చేయసాగారు. ఈ నేపథ్యంలో వినేశ్‌ స్పందించింది.

ఇవి కూడా చదవండి

‘రూ.2కి ట్వీట్‌ చేసి ఉచితంగా జ్ఞానాన్ని పంచుకునే వారు జాగ్రత్తగా వినండి.. నోర్మూసుకుని ఓ మూలకు కూర్చొని ఏడవండి. కోట్లు ఇస్తామన్నా శీతల పానీయాలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ వంటి వాటికి ప్రచారం చేయడానికి తిరస్కరించా. నేను నా విలువల పట్ల ఎప్పుడూ రాజీపడలేదు. నేను సాధించిందంతా నిజాయితీగా కష్టపడి సాధించా. అందుకు గర్వపడుతున్నా. ఇక అడగటం విషయానికొస్తే.. హక్కులు లాక్కోబడవు. వాటిని గెలుచుకోవడం నా పూర్వీకుల నుంచి నేర్చుకున్నాను. కాబట్టి నచ్చని వారు మూలన కూర్చుని ఏడవండి. నేను నా సొంత వెన్నెముఖపై నిలబడాలని అనుకుంటున్నాను. ఈ పోరాటం డబ్బు గురించి కాదు. ఆత్మగౌరవం గురించి..’ అంటూ వినేశ్‌ ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.