Road Safety World Series T20: ఏం బ్యాటింగ్ స్వామీ ఇది.. ‘టైమ్ గ్యాప్ అంతే.. టైమింగ్‌లో గ్యాప్ లేదంటున్న సేహ్వాగ్’..!

|

Mar 06, 2021 | 2:15 AM

Road Safety World Series T20: ఏడాది తరువాత విరేంద్ర సేహ్వాగ్ బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లో కనిపించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఈ అవకాశాన్ని..

Road Safety World Series T20: ఏం బ్యాటింగ్ స్వామీ ఇది.. ‘టైమ్ గ్యాప్ అంతే.. టైమింగ్‌లో గ్యాప్ లేదంటున్న సేహ్వాగ్’..!
Follow us on

Road Safety World Series T20: ఏడాది తరువాత విరేంద్ర సేహ్వాగ్ బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లో కనిపించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఈ అవకాశాన్ని వీరూకి కల్పించింది. ఇండియా లెజెండ్స్ తరఫున క్రీజ్‌లోకి అడుగుపెట్టిన వీరూ.. గతంలో మాదిరిగానే సచిన్‌తో జతకట్టాడు. అంతేనా.. మునుపటి సత్తాను చాటిచెప్పాడు. తన బ్యాటింగ్ పవర్‌ను బంగ్లాదేశ్ లెజెండ్స్‌కు రుచి చూపించాడు. ఫలితంగా కేవలం 10.1 ఓవర్లలో 110 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. భారత లెజెండ్స్ జట్టుకు విజయాన్ని అందించాడు.

110 పరుగుల లక్ష్యంతో ఇండియా లెజెండ్స్ టీమ్ ప్లేయర్లుగా సచిన్, వీరేంద్ర సేహ్వాగ్ ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చారు. వీరేంద్ర సేహ్వాగ్ రావడం రావడంతో తన బ్యాట్‌కు పని చెప్పాడు. తనలో వేడి ఇంకా తగ్గలేదని చెబుతూ.. వీరోచిత బ్యాటింగ్‌లో బంగ్లాదేశ్ లెజెండ్స్ టీమ్‌కు చుక్కలు చూపించాడు. మొహమ్మద్ రఫీక్ తొలి ఓవర్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేశాడు. ఆ తరువాత మొహమ్మద్ షరీఫ్ ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టాడు. సచిన్ టెండూల్కర్ కూడా ఫోర్లతో తన ఖాతా తెరిచాడు. అలమ్‌గీర్ కబీర్ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. దాంతో కేవలం 4 ఓవర్లలోనే ఇండియా లెజెండ్స్ జట్టు 51 పరుగులు పూర్తి చేసింది. ఈ 51లోనూ సేహ్వాగ్‌ ఒక్కడే 39 పరుగులు చేశాడు. మొత్తంగా 10 ఫోర్లు, ఐదు సిక్సర్లతో బౌలర్లను హడలెత్తించాడు. కేవలం 35 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. సేహ్వాగ్ స్ట్రైక్ రేట్ 228.57గా ఉంది. ఇక సచిన్ టెండూల్కర్ 26 బంతుల్లో 33 పరుగులు చేసి కేవలం 10.1 ఓవర్లలోనే 110 పరుగుల టార్గెట్‌ను ఫినిష్ చేశారు. 10 వికెట్ల తేడాతో ఇండియా లెజెండ్స్‌కు విజయాన్ని అందించారు. ఇక ఖలీద్ మెహమూద్ వేసిన ఓవర్లో సెహ్వాగ్, సచిన్ మూడు ఫోర్లు కొట్టారు. ఆ తర్వాత పదో ఓవర్లో సెహ్వాగ్ సిక్స్ కొట్టడంతో ఇండియా లెజెండ్స్ టీమ్ విజయం సాధించింది.

అంతకుముందు టాస్ గెల్చి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నజీముద్దీన్ (49) తప్ప ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. 110 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ బంగ్లా బౌలర్లను చితక్కొట్టారు. కెప్టెన్ టెండుల్కర్ కాస్త నెమ్మదిగా ఆడాడు. ప్రగ్యాన్ ఓజా, యువరాజ్ సింగ్ అద్భుతమైన పోలింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Also read:

ACB Caught Sarpanch: కాంప్లెక్స్ నిర్మాణాన్ని అడ్డుకున్నాడు.. చివరికి అడ్డంగా బుక్కయ్యాడు.. ఓ సర్పంచ్ కథలు ఇవి..!

Summer Effect: ఇవి మామూలు కోతులు కాదండోయ్.. భక్తుల కోసం ఏర్పాటు చేస్తే వానర సేన వచ్చి ఏం చేసిందంటే..