
Wimbledon 2021: వెటరన్ ఇండియన్ టెన్నిస్ ద్వయం సానియా మీర్జా, రోహన్ బోపన్న వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లో మరో విజయాన్ని నమోదు చేశారు. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన ఐడాన్ మెక్‌హగ్, ఎమిలీ వెబ్లీ-స్మిత్‌లను 6-3, 6 -1 తేడాతో ఓడించి, మూడవ రౌండ్లోకి దూసుకెళ్లారు. ముందునుంచి ఆధిపత్యం చెలాయించిన ఈ జోడీ వరుస సెట్లలో బ్రిటన్ జోడీని ఓడించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ కు చేరుకున్న ఈ జోడీ… వింబుల్డన్ లో తమ తొలి టైటిల్ కోసం ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. తల్లి అయిన తరువాత తన మొదటి వింబుల్డన్ ఆడుతున్న సానియా మీర్జా.. విజయాలతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. మహిళల డబుల్స్‌లో సానియా జోడీ పరాజయం పాలైనప్పటికీ, మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం బోపన్న తో కలిసి వరుస విజయాలు సాధిస్తూ.. మూడో రౌండ్లోకి ఎంటరైంది. మహిళల డబుల్స్ లో తన ప్రయాణాన్ని ముగించిన సానియా.. మిక్స్డ్ డబుల్స్ పతకం కొట్టాలని ఆశిస్తోంది. సానియా, తన అమెరికన్ భాగస్వామి బెథానీ మాట్టెక్-సాండ్స్‌తో 6-4, 6-3 తేడాతో రష్యన్ జోడీ ఎలెనా వెస్నినా, వెరోనికా కుడర్మెటోవా చేతిలో ఓడిపోయింది.
మొదటి రౌండ్లో యువ జంట అంకితా రైనా, రాంకుమార్ రామనాథన్లపై 6-2, 7-6 తేడాతో సానియా మీర్జా- బోపన్న జోడీ విజయం సాధించింది. ఇక మూడవ రౌండ్లో విజయం సాధించి తమ జైత్రయాత్రను కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Team India: పృథ్వీషాను కోరినట్లైతే.. వాళ్లను అవమానించినట్లే: మాజీ సారథి కపిల్ దేవ్
IND vs ENG: టీమిండియా కచ్చితంగా టెస్టు సిరీస్ గెలుస్తుంది: ఇయాన్ చాపెల్