Tokyo Olympics 2021: చరిత్ర సృష్టించిన బెర్ముడా.. ఒలింపిక్స్‌లో మొదటిసారిగా స్వర్ణం కైవసం..

|

Jul 27, 2021 | 10:01 PM

Flora Duffy wins women's triathlon: జపాన్ రాజధాని టోక్యోలో ప్రస్తుతం ఒలింపిక్ క్రీడలు జోరందుకున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడానికి కష్టపడుతున్నాయి. ఒలింపిక్స్‌లో

Tokyo Olympics 2021: చరిత్ర సృష్టించిన బెర్ముడా.. ఒలింపిక్స్‌లో మొదటిసారిగా స్వర్ణం కైవసం..
Flora Duffy Wins Women's Triathlon
Follow us on

Flora Duffy wins women’s triathlon: జపాన్ రాజధాని టోక్యోలో ప్రస్తుతం ఒలింపిక్ క్రీడలు జోరందుకున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడానికి కష్టపడుతున్నాయి. ఒలింపిక్స్‌లో ఎలాగైనా పతకం సంపాదించాలని అన్ని దేశాలకు చెందిన క్రీడాకారులు తీవ్రంగా కష్టపడుతుంటారు. ఇప్పటికే అమెరికా, చైనా సహా దేశాలు బంగారు పతకాలతో సహా పలు పతకాలను ఖాతాలో వేసుకుంటున్నాయి. ఈ తరుణంలో బంగారు పతకం సాధించడానికి జనాభా ముఖ్యం కాదని బెర్ముడా నిరూపించింది. చరిత్రలో మొదటిసారి ఒలింపిక్ బంగారు పతకాన్ని సాధించి బెర్ముడా రికార్డుల్లోకెక్కింది.

టోక్యో ఒలింపిక్స్‌లో ఉమెన్స్ ట్రయథ్లాన్‌లో బెర్ముడా బంగారు పతకాన్ని సాధించింది. ఈ ఘనతతో బెర్ముడా సంబరాల్లో మునిగి తెలుతోంది. మహిళల ట్రయాథ్లాన్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభతో ఊహించని విధంగా బెర్ముడాకు చెందిన ఫ్లోరా డఫీ బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. 33 ఏళ్ల ఫ్లోరా డఫి గంట 55:36 నిమిషాల్లో మొదటి స్థానంలో గమ్యానికి చేరుకొని బంగారు పతకం సాధించింది. కాగా.. బ్రిటన్ 2 వ స్థానంలో నిలువగా.. అమెరికా 3 వ స్థానంలో నిలిచింది.

బెర్ముడా జనాభా కేవలం 70 వేలు మాత్రమే. దాదాపు 45 ఏళ్ల తరువాత ఈ దేశానికి ఒలింపిక్స్ పతకం లభించింది. బెర్ముడాలో బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్ ఫ్లోరా నలిచింది. వాస్తవానికి, 1976 లో హెవీవెయిట్ విభాగంలో క్లారెన్స్ కాహిల్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. దేశంలో మొట్టమొదటి ఒలింపిక్ పతక విజేత అతనే. ఆ తర్వాత ఇప్పుడు 45 ఏళ్ల తరువాత ఆ దేశం 2 వ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది. అది కూడా బంగారు పతకం సాధించి రికార్డుల్లో పేరును నమోదు చేసుకుంది.

Also Read:

Tokyo Olympics 2020 Highlights: మ్యాచ్ గెలిచారు.. కానీ క్వార్టర్స్‌కు క్వాలిఫై కాలేకపోయారు..

Tokyo Olympics 2021: టోక్యోలో విజృంభిస్తున్న కరోనా.. రికార్డు స్థాయిలో కేసుల నమోదు.. క్రీడా గ్రామంలో..