Tokyo Olympics 2020 : టోక్యో ఒలింపిక్స్ లో సెమీస్ లో ప్రపంచ నెంబర్ 1 జట్టు బెల్జియం చేతిలో భారత్ ఓడింది. 5-2 గోల్స్ తేడాతో ఇండియా పరాజయం పొందింది. పతకం ఖాయం చేసుకోవడం కోసం భారత, బెలియం జట్టు హోరాహోరీగా తలపడ్డాయి. ఇరు జట్లు రెండో క్వార్టర్ ముగిసే సరికి 2-2 గోల్స్ చేసి హోరాహోరీగా తలపడ్డాయి. అయితే నాలుగో క్వార్టర్ లో అడుగు పెట్టిన తర్వాత బెల్జియం జట్టు తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఆడింది. వరసగా రెండు గోల్స్ చేసి.. భారత్ పై 5-2 గోల్స్ తేడాతో గెలిచి టోక్యో ఒలంపిక్స్ లో ఫైనల్ కు చేరుకుంది. ఇక భారత్ కాంస్య పతకం కోసం మన్‌ప్రీత్ సింగ్ బృందం మరో మ్యాచ్ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది.
41 ఏళ్లుగా ఊరిస్తున్న ఒలింపిక్ పసిడి పతకాన్ని ఖాయం చేసుకునేందుకు భారత పురుషుల హాకీ జట్టు ప్రయాణం అడుగు దూరంలో ఆగిపోయింది. 1972 తర్వాత ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీఫైనల్ దశకు అర్హత సాధించిన భారత్…సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ బెల్జియం జట్టుపై విజయం సాధించాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు.. అయితే నాలుగో క్వార్టర్ వరసగా బెల్జియం భారత్ పై 3 గోల్స్ చేసి ఫైనల్ కు చేరుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉంది బెల్జియం.. పై ఓడిన భారత్ జట్టు కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ ఆడి అందులో గెలవాల్సి ఉంటుంది.
Also Read: