Indian Hockey: ఒలింపిక్స్‌లో భారత హాకీ ప్రయాణం.. వరసగా 6 గోల్స్ మెడల్స్‌తో స్వర్ణయుగం నుంచి పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణ వరకూ..

|

Aug 05, 2021 | 11:15 AM

India Hockey Journey in Olympics: ఒలింపిక్స్ క్రీ.పూ.776 లో ప్రారంభమయ్యాయి. ప్రతి నాలుగేళ్లకు ఓ సారి జరిగే ఈ ఒలింపిక్స్ ను క్రీ.శ.393 లో నిలిపి వేసారు.మళ్ళీ క్రీ.శ. 1896లో ఏథెన్స్ లో తిరిగి ప్రారంభమయ్యాయి. మధ్యలో కొంతకాలం..

Indian Hockey: ఒలింపిక్స్‌లో భారత హాకీ ప్రయాణం.. వరసగా 6 గోల్స్ మెడల్స్‌తో స్వర్ణయుగం నుంచి పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణ వరకూ..
India Hockey Journey
Follow us on

India Hockey Journey in Olympics: ఒలింపిక్స్ క్రీ.పూ.776 లో ప్రారంభమయ్యాయి. ప్రతి నాలుగేళ్లకు ఓ సారి జరిగే ఈ ఒలింపిక్స్ ను క్రీ.శ.393 లో నిలిపి వేసారు.మళ్ళీ క్రీ.శ. 1896లో ఏథెన్స్ లో తిరిగి ప్రారంభమయ్యాయి. మధ్యలో కొంతకాలం ప్రపంచ యుద్ధాల వలన ఒలింపిక్స్ నిర్వహణలో అంతరాయం ఏర్పడినా దాదాపు అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ మహా క్రీడలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఒలింపిక్స్ లో భారత దేశం తొలిసారిగా 1900 పాల్గొంది. ఆ ఒలింపిక్ క్రీడలలో భారత్‌ నుంచి పాల్గొన్న ఏకైక క్రీడాకారుడు నార్మన్ ప్రిచర్డ్. ఈ అథ్లెటిక్ క్రీడాకారుడైన ప్రిచర్డ్ రెండు పతకాలను భారత దేశానికి అందించాడు. ఇక భారత్ తన జట్టుని ఒలింపిక్స్ పోటీలకు 1920 లో పంపింది. అప్పటినుంచి భారత్ ప్రతి వేసవి ఒలింపిక్స్ క్రీడల్లోనూ ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే ఇప్పటి వరకూ భారత్ లో ఎక్కువ పతకాలను తెచ్చి పెట్టిన క్రీడా హాకీ.

1928 నుంచి 1980 మధ్యలో భారత హాకీ జట్టు 12 ఒలింపిక్ క్రీడల్లో 11 పతకాలు సాధించి రికార్డు స్థాపించింది. అందుకనే ఈ కాలాన్ని ఒలింపిక్స్ లో భారత్ హాకీకి స్వర్ణ యుగం అంటారు. ఎందుకంటే 1928 నుంచి 1956 వరకు వరుసగా 6 సార్లు స్వర్ణాన్ని సాధించడం విశేషం. ఇప్పటి వరకూ ఒలింపిక్ క్రీడల్లో భారత్ 9 గోల్డ్ మెడల్స్ ను అందుకుంది. వాటిల్లో 8 స్వర్ణాలు జాతీయ క్రీడ అయిన హాకీలో కాగా మరో స్వర్ణపతకం 2008 బీజింగ్ ఒలింపిక్ పోటీల్లో షూటింగ్‌లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా సాధించాడు.అయితే కాలక్రమంలో హాకీ జట్టు తన ప్రభావాన్ని కోల్పోయింది. స్వర్ణయుగం నుంచి కనీసం క్వాలిఫై అయితే చాలు అనే స్టేజ్ కు చేరుకుంది భారత హాకీ జట్టు. దీంతో 41 ఏళ్ల నుంచి ఒలింపిక్స్ లో హాకీ జట్టు పతకం సాధించాలని ప్రతి భారతీయుడు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లకు టోక్యో ఒలింపిక్స్ లో మళ్ళీ కాంస్యం అందుకుని 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.

గురువారం జరిగిన పురుషుల హాకీ బ్రాంజ్ ఫైట్‌లో భారత్ 5-4 తేడాతో జర్మనీని చిత్తు చేసింది. మ్యాచ్ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన మన్‌ప్రీత్ సేన చిరస్మరణీయ విజయాన్నందుకుంది. గతంలో 8 గోల్డ్ మెడల్స్ గెల్చిన భారత్.. 1980 నుంచి ఇప్పటి వరకు ఒక్క పతకం గేలవలేదు. తాజా కాంస్య పతకంతో ఆ కరువు తీరింది.
అయితే నిజానికి 1980 లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకుంటే ఇప్పటి జట్టు ప్రదర్శన మెరుగుగా ఉందని.. పసిడి పట్టేస్తుందని చాలా మంది భావించారు. కానీ సెమీఫైనల్ లో ఒత్తిడి ని తట్టుకోలేక చివరి 15 నిమిషాల్లో ప్రత్యర్థి జట్టుకి గోల్స్ ఇచ్చి.. కాంస్యం తో సరిపెట్టుకుంది. అయితే ఈ సారి పతకం అందుకోవడానికి పోడియంలోకి వెళ్తున్న భారత హాకీ జట్టుని చూసి మళ్ళీ హాకీకి మంచిరోజులు వచ్చాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

1928 నుంచి 1964 వరకూ మధ్య కాలాన్ని భారత హాకీకి స్వర్ణయుగంగా పిలుస్తారు. ఎందు కంటే అప్పుడు భారత్ ఏడు స్వర్ణ పతకాలు సాధించింది. వీటిలో ఆరు వరుసగా గెలిచింది. ఇక మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత జాతీయ క్రీడా హాకీ పతనం మొదలైంది. దీనికి కారణం క్రీడా మైదానం గడ్డి మైదానాలకు బదులు కృత్రిమ టర్ఫ్ ఉపయోగించడమేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక భారత హాకీ జట్టు 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌కు కనీసం క్వాలిఫై కూడా కాలేదు.దీంతో భారత హాకీ జట్టుకు కోచ్ లుగా విదేశీయుల నియామకం మొదలైంది. జోస్ బ్రాసా, మైకేల్ నోబ్స్, టెరీ వాల్ష్, పాల్ వాన్ ఎస్, రోలెంట్ ఓల్ట్‌మెస్ వంటి ఎంతోమంది కోచ్‌లు భారత్ వచ్చారు. చాలామంది తమ పదవీకాలం పూర్తి కాకుండా స్వదేశం వెళ్లిపోయారు. అయితే 2012 లండన్ ఒలింపిక్స్‌లో చివరి స్థానంలో నిలవగా రియో ఒలింపిక్స్‌లో 8వ స్థానంలో నిలిచింది. చివరకు గ్రాహమ్ రీడ్ భారత్ మెన్ హాకీ జట్టుని టోక్యో ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్ వరకూ తీసుకుని వచ్చారు. చివరకు కాంస్యం పతకం భారత జట్టు అందుకుంది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదింపింది.

Also Read: Tokyo Olympics: చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు.. కాంస్యం సొంతం