
India squad for New Zealand Tests: భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్‌కు టీమిండియాలోని స్టార్ ప్లేయర్లు దూరం కానున్నారు. రోహిత్ శర్మ, బుమ్రా, షమీ, పంత్ లాంటి ప్లేయర్లు తప్పుకోనున్నారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని, రెండో టెస్టుకు మాత్రం కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడని బీసీసీఐ పేర్కొంది. నిరంతర క్రికెట్ ఆడటం వల్ల స్టార్ ప్లేయర్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో అజింక్యా రహానే సారథ్యంలో టీమిండియా సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. నవంబర్ 25 నుంచి కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత రెండోది, చివరి టెస్టు ముంబైలో జరగనుంది.
ఈ మేరకు బీసీసీఐ నేడు న్యూజిలాండ్‌తో తలపడే భారత్ జట్టును ప్రకటించింది. నవంబర్ 11న టెస్టు సిరీస్ కోసం సెలక్షన్ కమిటీ సమావేశం నిర్వహించి జట్టును ఖరారు చేసింది. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ టీ20లో కెప్టెన్‌గా ఉండనున్నాడు. టీ20 సిరీస్ తరువాత విశ్రాంతి తీసుకోనుండడంతో టెస్టుల్లో ఆడడు. అదే సమయంలో, విరాట్ కోహ్లీ మాత్రం టీ20లకు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నాడు. అలాగే తొలి టెస్టుకు కూడా రెస్ట్ తీసుకోనుండడంతో.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. డిసెంబరు 3 నుంచి ముంబైలో జరిగే టెస్టుకు కోహ్లీ తిరిగి రానున్నాడు. అదే సమయంలో టీ20 సిరీస్‌లో జట్టుకు నాయకత్వం వహించిన తర్వాత రోహిత్ విశ్రాంతి తీసుకోనున్నాడు.
టెస్టు సిరీస్ సందర్భంగా రోహిత్, కోహ్లితో పాటు మరికొందరు కూడా విశ్రాంతి తీసుకోనున్నారు. వీరిలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీల ఫాస్ట్ బౌలింగ్ జోడి కూడా ఉంది. శార్దూల్ ఠాకూర్ కూడా విశ్రాంతి తీసుకోనున్నాడు. పంత్ గైర్హాజరీలో వృద్ధిమాన్ సాహా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టగా, కేఎస్ భరత్ ఈ సిరీస్‌కు రెండో వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల భరత్ ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఐదుగురు స్టాండ్‌బై ప్లేయర్‌లలో అతను ఒకడు.
తొలి టెస్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ గైర్హాజరు కావడంతో బ్యాటింగ్ లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి. వీరి స్థానంలో చాలా మంది బ్యాట్స్‌మెన్స్ ఉన్నప్పటికీ జట్టులో ఛటేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్ చోటు దక్కించుకున్నారు. కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌లు ఓపెనింగ్ చేయనున్నారు. ఇక ఫాస్ట్ బౌలింగ్ గురించి మాట్లాడితే మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్‌లతో పాటు ప్రసిద్ధ కృష్ణను కూడా చేరాడు.
న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ నుండి టీమ్ ఇండియా యొక్క కొత్త సహాయక సిబ్బంది కూడా జట్టులో చేరనున్నారు. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కి ఇదే తొలి సిరీస్. మరోవైపు, ఊహించిన విధంగా టీ20 ప్రపంచ కప్‌లో భారత ప్రచారం ముగియడంతో పదవీకాలం ముగిసిన భరత్ అరుణ్ స్థానంలో పరాస్ మాంబ్రే కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. విక్రమ్ రాథోర్ బ్యాటింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేయడంతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ నియమితులు కానున్నారు. ద్రవిడ్ ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మను కోరుకున్నాడని తెలుస్తోంది. అయితే శ్రీలంక పర్యటనలో భారత జట్టుతో పాటు వచ్చిన దిలీప్‌ను క్రికెట్ సలహా కమిటీ ఎంపిక చేసింది.
భారత స్వ్కాడ్:
అజింక్యా రహానే (కెప్టెన్), ఛతేశ్వర పుజారా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్, ఎస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేఎస్ భరత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఎ పటేల్, జె యాదవ్, ఇషాంత్ శర్మ , ఉమేష్ యాదవ్, సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ
#TeamIndia squad for NZ Tests:
A Rahane (C), C Pujara (VC), KL Rahul, M Agarwal, S Gill, S Iyer, W Saha (WK), KS Bharat (WK), R Jadeja, R Ashwin, A Patel, J Yadav, I Sharma, U Yadav, Md Siraj, P Krishna
*Virat Kohli will join the squad for the 2nd Test and will lead the team. pic.twitter.com/FqU7xdHpjQ
— BCCI (@BCCI) November 12, 2021
Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!