గత కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోన్న వివో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. ఇప్పుడు వివో స్థానంలో టాటా గ్రూప్ ఎంపికైంది. మంగళవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో టైటిల్ స్పాన్సర్ విషయంపై కూడా చర్చజరిగింది. ఈమేరకు ఐపీఎల్ టైటిల్ కొత్త స్పాన్సర్‌గా టాటా గ్రూప్ ఎంపికైందని ఐపీఎ ల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ధ్రువీకరించారు. ఈ ఏడాది ఐపీఎల్ నుంచే టాటా గ్రూప్ సంస్థ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సమావేశం అనంతరం మాట్లాడిన బ్రిజేష్ పటేల్ ‘ అవును.. వివో స్థానంలో టాటా గ్రూప్ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది జరగనున్న IPL 2022 లీగ్ నుంచే ఈ ఒప్పందం అమలు కానుంది’ అని చెప్పుకొచ్చారు.
కాగా 2018-2022 వరకు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం ప్రముఖ చైనా మొబైల్ కంపెనీ అయిన వివోతో బీసీసీఐతో రూ.2,200 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2020 సీజన్ సమయంలో గాల్వాన్ లోయలో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా, ఆ ఏడాది వివోను స్పాన్సర్ గా తప్పించారు. దీని స్థానంలో డ్రీమ్11 స్పాన్సర్‌గా వ్యవహరించింది. కానీ మరుసటి సీజన్ లో వివోనే మళ్లీ స్పాన్సర్ గా కొనసాగింది. అయితే ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వివోతో ఇంకో సీజన్‌కు స్పాన్సర్‌గా కొనసాగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఆ స్థానంలో టాటాగ్రూప్ వచ్చింది. చైనా కంపెనీల ఉత్పత్తులతో ఐపీఎల్ లీగ్‌పై ప్రతికూల ప్రభావం పడుతోందని, అందుకే ఏడాది ముందుగానే వివోను తప్పించినట్లు బీసీసీఐ వర్గాలు చెబతున్నాయి. అయితే కొత్త స్పాన్సర్ టాటా గ్రూప్ బీసీసీఐకి ఎంత మొత్తం చెల్లించనుందన్నది ఇంకా తెలియరాలేదు. ఈసారి ఐపీఎల్ లో రెండు కొత్త జట్లతో సహా మొత్తం 10 జట్లు పోటీపడతున్నాయి. ఈ నేపథ్యంలో స్పాన్సర్ షిప్ మొత్తం కూడా భారీగానే ఉండే అవకాశాలున్నాయి. కాగా ఐపీఎల్ 2022లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో ఫ్రాంచైజీలు అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
TATA to replace VIVO as IPL title sponsor next year: IPL Chairman Brijesh Patel to ANI pic.twitter.com/n0NVLTqjjG
— ANI (@ANI) January 11, 2022
Also Read:Shimbu: కోలీవుడ్ హీరో శింబుకు అరుదైన గౌరవం.. ఎవరికి అంకితమిచ్చాడంటే..
Viral Photo: ఈ ఫోటోలోని చిన్నారి ఓ కల్ట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ఎవరో గుర్తుపట్టారా..?
Coronavirus: అన్ని ప్రైవేటు ఆఫీసుల్లో వర్క్ ఫ్రమ్ హోం.. కీలక ఆదేశాలిచ్చిన ఆ రాష్ట్ర ప్రభుత్వం