గంగూలీ ధరించిన బ్లేజర్ సీక్రెట్..ఆయన మాటల్లోనే..!

|

Oct 23, 2019 | 6:32 PM

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని సౌరవ్‌ గంగూలీ అన్నారు. దేశంలోని ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దాదా మీడియాతో మాట్లాడారు. భారత క్రికెట్‌కు మేలు చేసేందుకే తామున్నామని.. క్రికెట్‌ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం సంతోషదాయకమన్నారు. ముంబయి నగరం టీమిండియాకు ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లను అందించిందని చెప్పారు. ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఉందని.. కెప్టెన్‌ కోహ్లీకి అన్ని విధాలా సహాయ సహకారాలు […]

గంగూలీ ధరించిన బ్లేజర్ సీక్రెట్..ఆయన మాటల్లోనే..!
Follow us on

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నానని సౌరవ్‌ గంగూలీ అన్నారు. దేశంలోని ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దాదా మీడియాతో మాట్లాడారు. భారత క్రికెట్‌కు మేలు చేసేందుకే తామున్నామని.. క్రికెట్‌ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం సంతోషదాయకమన్నారు. ముంబయి నగరం టీమిండియాకు ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లను అందించిందని చెప్పారు. ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఉందని.. కెప్టెన్‌ కోహ్లీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని గంగూలీ స్పష్టం చేశారు.

దాదా వేసుకున్న బ్లేజర్ విశిష్ఠత ఏంటో తెలుసా..?

దాదా మీడియా స‌మావేశానికి టీమిండియా బ్లేజ‌ర్ వేసుకుని వచ్చారు. ఈ బ్లేజర్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.  ‘ఈ బ్లేజర్‌ను నాకు టీం ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన ఈ బ్లేజర్‌ను ఇప్పుడు ధరించాలనుకున్నాను. కానీ ఇది చాలా వదులైంది.’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో మీడియా సమావేశానికి హాజరైన వారందరూ ఒక్కసారిగా నవ్వారు.

‘బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడాన్ని గౌరవంగా భావిస్తున్నా. భారత క్రికెట్‌కు మేలు చేసేందుకే ఇక్కడ ఉన్నాం. క్రికెట్‌ కమిటీలు, సంఘాల్లోకి మాజీ క్రికెటర్లు రావడం ఎంతో సంతోషంగా ఉంది. బీసీసీఐ నిర్వ‌హ‌ణ‌లో ఎటువంటి లోపం ఉండదు. బోర్డులో ఎటువంటి అవినీతి జ‌ర‌గ‌కుండా చర్యలు తీసుకుంటాం. అంద‌రికీ బోర్డు ఒకేలా ఉంటుంది. నేను టీమిండియాకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన త‌ర‌హాలోనే.. బీసీసీఐని కూడా ముందుకు న‌డిపిస్తా’ అని గంగూలీ అన్నారు.

కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టినందున కెప్టెన్‌, కోచ్‌ గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదని దాదా వ్యాఖ్యానించారు. భారత క్రికెట్‌ చరిత్రలో మహేంద్రసింగ్‌ ధోనీది ప్రత్యేక స్థానమని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కెప్టెన్‌, కోచ్‌, ఆటగాళ్ల ఎంపికంతా సెలెక్షన్‌ కమిటీ చేతుల్లోనే ఉంటుందన్నారు. టీమిండియా కెప్టెన్లంతా బీసీసీఐ అధ్యక్షులతో సఖ్యతగానే ఉన్నారని గుర్తుచేశారు.