“గంగూలీ పుట్టుకతోనే కెప్టెన్”

భార‌త మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్​ గంగూలీపై ప్రశంసలు కురిపించాడు టీమిండియా సెలక్షన్​ కమిటీ మాజీ ఛైర్మన్​ క్రిస్​ శ్రీకాంత్​. దాదా.. వెస్టిండీస్​ లెజెంట్ క్లైవ్​ లాయిడ్​ లాంటి గొప్ప ప్లేయ‌ర్ అని అభిప్రాయ‌ప‌డ్డాడు.

గంగూలీ పుట్టుకతోనే కెప్టెన్

Updated on: Jun 21, 2020 | 1:32 PM

భార‌త మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరభ్​ గంగూలీపై ప్రశంసలు కురిపించాడు టీమిండియా సెలక్షన్​ కమిటీ మాజీ ఛైర్మన్​ క్రిస్​ శ్రీకాంత్​. దాదా.. వెస్టిండీస్​ లెజెండ్ క్లైవ్​ లాయిడ్​ లాంటి గొప్ప ప్లేయ‌ర్ అని అభిప్రాయ‌ప‌డ్డాడు. అతడికి లీడ‌ర్షిప్ క్వాలిటీస్ స్వతహాగా పుట్టుకతోనే ఉన్నాయని కొనియాడాడు. విదేశీ గడ్డపై భార‌త జ‌ట్టు విజయాలు సాధించడానికి స్ఫూర్తిగా నిలిచాడని అన్నాడు.

“గంగూలీ కీల‌కంగా వ్యవహరిస్తాడు. బలమైన జట్టును తయారుచేయగల కెపాసిటీ అత‌డిలో ఉంది. 1976లో కెప్టెన్ గా వ్యవహిరించిన వెస్టిండీస్​ లెజెండ్ క్లైవ్ లాయిడ్ బలమైన టీమ్ ను ఎలా తయారుచేశాడో అలానే గంగూలీ కూడా భార‌త‌ జట్టును రూపొందించి వారిని గెలుపువాకిట నిలిపాడు. అందుకే గంగూలీ విజయవంతమైన కెప్టెన్ అయ్యాడు” అని క్రిస్​ శ్రీకాంత్​ పేర్కొన్నాడు.