IND vs SL: నేడు భారత్‌- శ్రీలంక మధ్య రెండో వన్డే.. ఈ గ్రౌండ్‌లో హిట్‌మ్యాన్‌కు అరుదైన రికార్డు.. మ్యాచ్‌ ను ఎక్కడ వీక్షించాలంటే..

|

Jan 12, 2023 | 6:34 AM

IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ జనవరి 12వ తేదీ గురువారం కోల్‌కతాలో జరగనుంది. తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో..

IND vs SL: నేడు భారత్‌- శ్రీలంక మధ్య రెండో వన్డే.. ఈ గ్రౌండ్‌లో హిట్‌మ్యాన్‌కు అరుదైన రికార్డు.. మ్యాచ్‌ ను ఎక్కడ వీక్షించాలంటే..
Ind Vs Sl 2nd Odi
Follow us on

IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ జనవరి 12వ తేదీ గురువారం కోల్‌కతాలో జరగనుంది. తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది. కోల్‌కతాలో రోహిత్ సేన గెలిస్తే, వారు తిరుగులేని ఆధిక్యాన్ని పొందుతారు. ఈ సిరీస్‌ను ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావిస్తున్నారు. తొలి వన్డేలో విరాట్‌ కోహ్లీ సెంచరీతో అదరగొట్టగా.. రోహిత్ శర్మ సెంచరీని 19 పరుగుల తేడాలో సెంచరీని కోల్పోయాడు, అయితే కోల్‌కతాలో సెంచరీ చేసేందుకు రోహిత్ గురిపెట్టే అవకాశం ఉంది. రోహిత్‌కి ఈ మైదానం చాలా ప్రత్యేకం. ఎనిమిదేళ్ల క్రితం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, శ్రీలంక జట్లు ముఖాముఖి తలపడినప్పుడు రోహిత్ 264 పరుగులు చేశాడు. రోహిత్ మంచి రిథమ్‌లో ఉండటంతో అదే జట్టు, అదే వేదికపై మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగలడని అంచనా వేస్తున్నారు.

భారత్-శ్రీలంక మధ్య రెండో వన్డే జనవరి 12 మంగళవారం జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న రెండో వన్డే మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కాగా, మ్యాచ్ టాస్ మధ్యాహ్నం 1 గంటకు వేస్తారు. వివిధ భాషలలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెళ్లలో రెండో వన్డేను చూడవచ్చు. అలాగే సబ్‌స్క్రిప్షన్‌తో Hotstarలో మ్యాచ్ యొక్క ఆన్‌లైన్ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు.

భారత జట్టు అంచనా

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్‌లిక్ అర్షదీప్‌ సింగ్

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..