లాక్‌డౌన్‌ పిచ్చోళ్లను చేసింది.. రూమర్లపై సాక్షి ఘాటు కామెంట్లు..!

| Edited By:

May 28, 2020 | 12:57 PM

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై వార్తలు రావడం కొత్తేం కాదు. అయితే వాటిని ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఖండిస్తూ వస్తున్నారు.

లాక్‌డౌన్‌ పిచ్చోళ్లను చేసింది.. రూమర్లపై సాక్షి ఘాటు కామెంట్లు..!
Follow us on

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై వార్తలు రావడం కొత్తేం కాదు. అయితే వాటిని ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఖండిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం ఉన్నట్లుండి ట్విట్టర్‌లో ధోని రిటైర్మెంట్‌పై పెద్ద ఎత్తున ట్వీట్ వచ్చాయి. DhoniRetires హ్యాష్‌ట్యాగ్‌తో చాలా ట్వీట్లు వచ్చాయి. దీంతో ఆ హ్యాష్‌ట్యాగ్ కాస్త ట్రెండ్ అవ్వగా.. ధోని భార్య సాక్షి సింగ్ రంగంలోకి దిగారు. ”అవన్నీ కేవలం గాలి వార్తలే. దీన్ని బట్టి లాక్‌డౌన్ మనుషులను పిచ్చోళ్లను చేసిందని అర్థమవుతోంది” అని సాక్షి ట్వీట్ చేశారు. ఆ తరువాత కాసేపటికే ఆమె ఆ ట్వీట్‌ని డిలీట్ చేశారు.

కాగా 2019 వరల్డ్ కప్‌ తరువాత ధోని క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌, టీమిండియా మ్యాచ్‌లో చివరిసారిగా కనిపించిన ధోని.. ఆ తరువాత క్రికెట్‌కి బ్రేక్ ఇచ్చారు. ఇక ఐపీఎల్‌లోనైనా ఆయన ఆటను చూడొచ్చని ఫ్యాన్స్ అనుకోగా.. కరోనా నేపథ్యంలో ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోని తిరిగి క్రికెట్ గ్రౌండ్‌లోకి వస్తారా..? లేదా..? అన్న ప్రశ్నలు ఆయన అభిమానుల్లో మెదులుతున్నాయి.

దానికి తోడు ధోని రిటైర్మెంట్‌పై మరో క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో ధోని కచ్చితంగా ఆడుతారు. అయితే టీమిండియా తరఫున ఆడుతారా..? లేదా..? అన్న విషయం ఆయననే చెప్పాలి. నాకు తెలిసి మళ్లీ ధోని బ్లూ జెర్సీ వేసుకోరని అనుకుంటున్నా. ఇప్పటికే భారత్‌ కోసం ఆయన చాలా ఆటలే ఆడారు. వరల్డ్ కప్‌నే తన చివరి మ్యాచ్‌ అని ధోని డిసైడ్ అయినట్లు సమాచారం ఉంది అన్నారు.

Read This Story Also: సినీ పెద్దల సమావేశంపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు..!