సచిన్‌కు అరుదైన గౌరవం… హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు

| Edited By:

Jul 20, 2019 | 4:22 PM

క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌కి అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సచిన్‌కు చోటు కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ప్రకటన చేసింది. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డోనాల్డ్‌, ఆసీస్‌ మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథిరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లను హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పించారు. భారత్ తరపున ఇప్పటి వరకూ బిషన్ సింగ్ బేడీ (2009), కపిల్‌దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ […]

సచిన్‌కు అరుదైన గౌరవం... హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు
Follow us on

క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌కి అరుదైన గౌరవం లభించింది. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో సచిన్‌కు చోటు కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ప్రకటన చేసింది. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డోనాల్డ్‌, ఆసీస్‌ మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథిరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌లను హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పించారు. భారత్ తరపున ఇప్పటి వరకూ బిషన్ సింగ్ బేడీ (2009), కపిల్‌దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018)కి మాత్రమే ఈ అవకాశం దక్కగా.. తాజాగా ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ కూడా చేరాడు.

వాస్తవానికి నాలుగేళ్ల క్రితం అనిల్ కుంబ్లేకి, రెండేళ్ల క్రితం రాహుల్ ద్రవిడ్‌కి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కగానే.. సచిన్‌‌ని ఎందుకు పక్కన పెడుతున్నారు..? అంటూ ఐసీసీపై అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే.. నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ఐదేళ్ల‌లోపు ఏ ఆటగాడ్నీ హాల్ ఆఫ్‌ ఫేమ్‌లో చేర్చరు. ఈ నేపథ్యంలో.. 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ గత ఏడాది చివరికిగానీ అర్హత సాధించలేకపోయాడు.

https://twitter.com/thecricketblues/status/1152468550000398337

https://twitter.com/iamlokendraM/status/1152414141912506368