Rohit Sharma Mocks Smith: బ్రిస్బేన్ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. లంచ్ విరామం తర్వాత ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఆట ఆడుకున్నాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్.. ఓవర్ మధ్యలో క్రీజులోకి వెళ్లి బ్యాటింగ్ చేస్తున్నట్లు పోజిచ్చాడు.
అచ్చం మూడో టెస్టులో స్మిత్ చేసినట్లుగా సీన్ రిపీట్ చేశాడు. గ్రీన్‌తో మాట్లాడుతూ కనిపించిన స్మిత్.. ఒకసారి రోహిత్ చేసేది చూసి.. వెంటనే తల తిప్పుకున్నాడు. కాగా, మూడో టెస్టులో స్మిత్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ క్రీజులోకి వచ్చి రిషబ్ పంత్ గీసుకున్న గార్డ్ మార్క్‌ను చెరిపేశాడంటూ పెద్ద వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దమని మాజీలు సైతం మండిపడ్డారు.
దీనితో ఈ వివాదంపై స్పందించిన స్మిత్.. టెస్టులలో ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడూ క్రీజులోకి వెళ్లి ప్రత్యర్ధి బ్యాట్స్‌మెన్ తమ బౌలర్లను ఎలా ఎదుర్కుంటున్నారో స్వయంగా తెలుసుకోవడం తనకి అలవాటు అంటూ వివరణ ఇచ్చాడు. ఈలోపే వివాదానికి సంబంధించి మరో వీడియో రావడంతో సమస్యకు పరిష్కారం దొరకలేదు.. స్మిత్ దోషిగా మిగిలిపోయాడు.
Rohit doing a Steve Smith ???#INDvsAUSTest #India #IndiavsAustralia #Australia #AUSvsIND #RohitSharma pic.twitter.com/ZclrUxQJXc
— SportsCafe (@IndiaSportscafe) January 18, 2021