వావ్.. ధోని రికార్డునే బ్రేక్ చేశాడు..!

|

Aug 08, 2019 | 12:15 AM

టీ20ల్లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. భారత్ తరపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. రెండేళ్ల క్రితం బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 56 పరుగులు చేసి రికార్డు సృష్టించగా.. అది ఇప్పుడు రిషబ్ పంత్ తిరగరాశాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ 42 బంతుల్లో 65 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర […]

వావ్.. ధోని రికార్డునే బ్రేక్ చేశాడు..!
Follow us on

టీ20ల్లో మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. భారత్ తరపున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. రెండేళ్ల క్రితం బెంగళూరులో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని 56 పరుగులు చేసి రికార్డు సృష్టించగా.. అది ఇప్పుడు రిషబ్ పంత్ తిరగరాశాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ 42 బంతుల్లో 65 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా భారత్‌ వికెట్‌ కీపర్లు టి20ల్లో సాధించిన టాప్‌-5 స్కోర్లలో నాలుగు ధోని పేరిట ఉండటం విశేషం.