యువరాజ్ జెర్సీనీ ఎవరికి కేటాయించొద్దు..బీసీసీఐ‌కు గంభీర్ అభ్యర్థన

|

Sep 23, 2019 | 8:09 PM

వారిద్దరూ టీమిండియా తాజా మాజీ ఆటగాళ్లు. ఒకరు డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ కాగా మరొకరు ప్రమాదకర ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. వీరిద్దరూ కూడా మంచి మిత్రులు. అందుకే యూవీకి ట్రిబ్యూట్‌గా..అతడి జెర్సీ నంబర్‌ 12ని మరెవరికీ కేటాయించకుండా దానికి రిటైర్మెంటివ్వాలని గంభీర్‌ బీసీసీఐని కోరినట్లు సమాచారం. భారత జట్టుకు రెండుసార్లు (2007 టీ20, 2011 వన్డే) ప్రపంచకప్‌ గెలవడానికి కీలక పాత్ర పోషించిన  యవీకి ఇదే అత్యుత్తమ గౌరవమని గౌతీ పేర్కొన్నాడు. సెప్టెంబర్‌ […]

యువరాజ్ జెర్సీనీ ఎవరికి కేటాయించొద్దు..బీసీసీఐ‌కు గంభీర్ అభ్యర్థన
Follow us on

వారిద్దరూ టీమిండియా తాజా మాజీ ఆటగాళ్లు. ఒకరు డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్ గౌతమ్ గంభీర్ కాగా మరొకరు ప్రమాదకర ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. వీరిద్దరూ కూడా మంచి మిత్రులు. అందుకే యూవీకి ట్రిబ్యూట్‌గా..అతడి జెర్సీ నంబర్‌ 12ని మరెవరికీ కేటాయించకుండా దానికి రిటైర్మెంటివ్వాలని గంభీర్‌ బీసీసీఐని కోరినట్లు సమాచారం. భారత జట్టుకు రెండుసార్లు (2007 టీ20, 2011 వన్డే) ప్రపంచకప్‌ గెలవడానికి కీలక పాత్ర పోషించిన  యవీకి ఇదే అత్యుత్తమ గౌరవమని గౌతీ పేర్కొన్నాడు. సెప్టెంబర్‌ నెల యూవీకెంతో ప్రత్యేకమని, 2007లో భారత జట్టు ఇదే నెలలో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ గెలిచిందని గంభీర్‌ గుర్తు చేసుకున్నాడు. యువీ ఆ రెండు ప్రపంచకప్‌లలో అత్యుత్తమంగా రాణించాడని, అలాంటి ఆటగాడి జెర్సీని బీసీసీఐ ఇతరులకు కేటాయించొద్దని కోరారు.

2007లో ఇంగ్లాండ్‌తో టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యువీ ఆరు వరుస సిక్సులతో జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. ఛేజింగ్‌లో ఇంగ్లాండ్‌ ఓడిపోయింది. అలాగే 2011లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న సిక్సుల వీరుడు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్‌పై వరుసగా ఆరు సిక్సులు ఎలా కొట్టావని యువరాజ్‌ని అడిగితే.. అది అనుకోకుండా జరిగిపోయిందని చెప్పాడని గంభీర్‌ అందులో పేర్కొన్నాడు. కాగా భారత జట్టు రెండు ప్రపంచకప్‌లు గెలవడంలో గంభీర్‌ కూడా ప్రధాన భాగమే. ఆ రెండు ఫైనల్‌ మ్యాచ్‌ల్లో భారత జట్టు తరఫున అత్యధిక స్కోర్లు సాధించిన క్రికెటర్‌ గంభీర్‌ కావడం విశేషం.