పాకిస్తాన్ కారణంగా ఇండియాలో ఒలంపిక్స్ నిర్వహణకు నిరాకరణ

ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్‌ షూటర్లకు భారత ప్రభుత్వం వీసాలు నిరాకరించడంపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంతో భవిష్యత్‌లో అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్‌తో చర్చలను నిలిపివేయాలని IOC నిర్ణయించింది. ఇండియాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ అథ్లెట్స్ ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు వీసాలను నిరాకరించింది భారత్. దీంతో IOC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వివక్షలు, రాజకీయ జోక్యాలు ఆటల్లో లెక్కచేయకూడదని సూచించింది. ఒలంపిక్ ఛార్టర్ విధివిధానాలకు […]

పాకిస్తాన్ కారణంగా ఇండియాలో ఒలంపిక్స్ నిర్వహణకు నిరాకరణ
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 8:22 PM

ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వచ్చే పాకిస్థాన్‌ షూటర్లకు భారత ప్రభుత్వం వీసాలు నిరాకరించడంపై అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంతో భవిష్యత్‌లో అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఆతిథ్యం ఇచ్చే విషయమై భారత్‌తో చర్చలను నిలిపివేయాలని IOC నిర్ణయించింది.

ఇండియాలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ అథ్లెట్స్ ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు వీసాలను నిరాకరించింది భారత్. దీంతో IOC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వివక్షలు, రాజకీయ జోక్యాలు ఆటల్లో లెక్కచేయకూడదని సూచించింది. ఒలంపిక్ ఛార్టర్ విధివిధానాలకు విరుద్దంగా భారత్ తీరు ఉండటంతో ఐవోసీ హెచ్చరించింది. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో అన్ని దేశాల అథ్లెట్లను, క్రీడా ప్రతినిధులను సమానంగా చూడాలని చెప్పింది. అథ్లెట్ల మధ్య ఆతిథ్య దేశం ఎలాంటి వివక్ష చూపించకూడదని తెలియపరిచింది.

పాక్ అథ్లెట్ల పోటీదారుల వీసాలను భారత్ నిరాకరించడం వల్లనే, ఆ దేశంతో చర్చలు నిలిపివేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. ఇకపై ఒలింపిక్‌ ఛార్టర్‌ నిబంధనలకు అనుగుణంగా విదేశీ పోటీదారులకు అనుమతి కల్పిస్తామని భారత ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ వచ్చేంతవరకు ఒలింపిక్‌ సంబంధింత పోటీలు నిర్వహించేందుకు ఆ దేశానికి అనుమతి ఇవ్వబోమని ఒలింపిక్‌ కమిటీ స్పష్టం చేసింది.

శుక్రవారం నుంచి దిల్లీలో షూటింగ్‌ ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. అయితే ఇటీవల జరిగిన పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ షూటర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. ఇదిలా ఉండగా.. భారత నిర్ణయంతో ప్రపంచకప్‌లో అందుబాటులో ఉన్న 16 ఒలింపిక్‌ (2020, టోక్యో) అర్హత స్థానాలను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్స్‌ సమాఖ్య తాజాగా ప్రకటించింది.