ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరిగిన తొలి టీ20లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (41; 42బంతుల్లో 5×4, 2×6) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ కూడా ఆకట్టుకోలేకపోయారు. బంగ్లా బౌలర్లలో షఫీయుల్ ఇస్తాం (2/36), అమినుల్ ఇస్లాం (2/22), అఫిఫ్ హుస్సేన్ (1/11) భారత్ పతనంలో కీలక పాత్ర పోషించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఓవర్లోనే లిటన్ దాస్(7) వికెట్‌ను కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సౌమ్య సర్కార్(39), మరో ఓపెనర్ నయీమ్(26)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఇక ఆ తర్వాత బరిలోకి దిగిన రహీమ్ (60*; 43బంతుల్లో 8×4, 1×6) అర్ధ సెంచరీతో అదరగొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. కాగా, పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
That’s that from Delhi. Bangladesh win the 1st T20I by 7 wickets and go 1-0 up in the 3-match series.#INDvBAN pic.twitter.com/z2ezFlifYx
— BCCI (@BCCI) November 3, 2019